శ్రీసిటీలో నూతన జర్మనీ పరిశ్రమకు భూమి పూజ

అంతిమతీర్పు- శ్రీసిటీ-నెల్లూరు జిల్లా

 

శ్రీసిటీలో నూతన జర్మనీ పరిశ్రమకు భూమిపూజ 


 


జర్మనీకి చెందిన బెల్ ఫ్లేవర్స్ అండ్ ఫ్రాగ్నాన్సెస్ అనుబంధ సంస్థ, వివిధ పారిశ్రామిక ఉత్పత్తులు, వంటకాలలో ఉపయోగించే సుగంధ పరిమళాలు తయారు చేసే "బెల్ ఫ్లేవర్స్ అండ్ ఫ్రాగ్నాన్సెస్ ఇండియా" నూతన పరిశ్రమ నిర్మాణానికి గురువారం శ్రీసిటీలో భూమిపూజ చేశారు. బెల్ ఫ్లేవర్స్ వైస్ ప్రెసిడెంట్ హైన్జ్ మైకెల్ లాంఛనంగా భూమిపూజ కార్యక్రమం నిర్వహించగా, బెల్ డైరెక్టర్ (ఆపరేషన్స్) మురళీకృష్ణ ఇతర పలువురు కంపెనీ సీనియర్ ప్రతినిధులు పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా హైన్జ్ మైకెల్ మాట్లాడుతూ, ఈ ప్లాంట్ స్థాపన ద్వారా స్థానిక మార్కెట్లో ప్రత్యక్ష ఉనికిని చాటుకోవడంతో పాటు, ఈ ప్రాంతంలోని తమ కస్టమర్లందరికీ సత్వర మరియు నాణ్యమైన సేవలను అందించగలమన్నారు. 


బెల్ బృందానికి శుభాకాంక్షలు తెలిపిన శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి , అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.