అక్టోబర్ 9 వ తారీకు డాక్టర్ రామినేని ఫౌండేషన్ వారి ప్రతిభా పురస్కారాలు

అక్టోబర్ 9 వ తారీకు డాక్టర్ రామినేని ఫౌండేషన్ వారి ప్రతిభా పురస్కారాలు..
గుంటూరు :


డాక్టర్ రామినేని ఫౌండేషన్ (యుఎస్ఏ) వారి 2019 సంవత్సరానికి ప్రతిభా పురస్కారాలు ప్రధానోత్సవం ఈ నెల 9 వ తారీకు బుధవారం గుంటూరు నగరం రింగ్ రోడ్ లోని సిద్ధార్థ గార్డెన్స్ లో జరుగుతుందని  డాక్టర్ రామినేని ఫౌండేషన్ కన్వీనర్, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పాతూరి నాగభూషణం తెలిపారు.. శనివారం సిద్ధార్థ గార్డెన్స్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి దేశంలోనే ఎక్కడా లేని విధంగా తండ్రి ఆశయం మేరకు జన్మభూమి రుణం తీర్చుకునేందుకు గ్రామీణ ప్రాంత విద్యార్థులను ప్రోత్సహించేందుకు వారు ఉన్నత లక్ష్యాలను ఏర్పరుచుకుని ముందుకు సాగాలని ఆలోచనతో డాక్టర్ రామినేని అయ్యన్న చౌదరి కుమారులు 2001 నుండి డాక్టర్ రామినేని ఫౌండేషన్ ప్రతిభ పురస్కారాలను అందిస్తుందని.. గుంటూరు జిల్లాలోని జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకొని  మండల స్థాయిలో అత్యధిక మార్కులు పొందిన విద్యార్థులకు ఈ పురస్కారాలు అందజేస్తున్నాను.. అలాగే 10వ తరగతిలో వందకు వందశాతం ఉత్తీర్ణత సాధించిన స్కూల్ హెడ్మాస్టర్ లకు గురు పురస్కారం, 100%  సాధించిన రిజల్ట్స్ సాధించిన హెడ్మాస్టర్ లకు గురు సన్మానం, రామినేని అయ్యన్న చౌదరి గారు జన్మించిన బ్రాహ్మణ కోడూరు, ఆయన చదువుకున్న తెనాలి, ఉపాధ్యాయులుగా  పనిచేసిన పాలపర్రు గుంటూరు జిల్లా మువ్వా గ్రామం కృష్ణా జిల్లా, జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థుల్లో పదవతరగతిలో అత్యధిక మార్కులు పొందిన విద్యార్థులకు పురస్కారాలు అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు, డాక్టర్ రామినేని ఫౌండేషన్ చైర్మన్ ధర్మ ప్రచారక్ మాట్లాడుతూ 106 మంది గురువులకు గురు పురస్కారం, 84 మంది గురువులకు గురు సన్మానం, 268 మంది విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అంద చేయడం జరుగుతుందని తెలిపారు.. ఈ కార్యక్రమానికి లెజెండ్రీ ఇండియన్ క్రికెటర్ శ్రీ కపిల్ దేవ్ గారు ముఖ్య అతిధి గా హాజరవుతారని తెలిపారు.. అతిథులుగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్, ఫిషర్స్ అండ్ మార్కెటింగ్ మంత్రి మోపిదేవి వెంకటరమణ, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం, ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాల గిరిధరరావు, డాక్టర్ ఎం మాలకొండయ్య ఐపిఎస్, ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, తానా ప్రెసిడెంట్ శ్రీ జయ తాళ్లూరి, జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్, భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ లు పాల్గొంటారని తెలిపారు..ఈ మీడియా సమావేశంలో డిప్యూటీ సీఈఓ కె.త్యాగరాజు, డిప్యూటీ డీఈవో నారాయణరావు లు పొల్గొన్నారు..