అక్రిడిటేషన్ల మంజూరులో చిన్న పత్రికలకు ప్రాధాన్యత ఇవ్వాలి

అక్రిడిటేషన్ల మంజూరులో చిన్న పత్రికలకు ప్రాధాన్యత ఇవ్వాలి
---------------------------------------------------------
 ఐ అండ్ పి ఆర్ కమిషనర్ కి సామ్నా వినతి
---------------------------------------------------------
         చిన్న పత్రికలకు అక్రిడిటేషన్ల మంజూరులో ప్రాధాన్యత ఇవ్వాలని స్టేట్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్( సామ్నా)  ఐ అండ్ పి ఆర్ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిని కోరింది.శుక్రవారం సామ్నా ప్రతినిధులు ఐ అండ్ పి ఆర్ కమిషనర్ ని కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. చిన్న పత్రికలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనలు మంజూరు చేయాలని కోరారు. జర్నలిస్ట్ హెల్త్ కార్డు అమలులో జరుగుతున్న జాప్యాన్ని నివారించి త్వరగా జర్నలిస్టులకు ఆరోగ్య సేవలు అందే విధంగా చూడాలని కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులకు సంబంధించిన అన్ని కమిటీలలో సామ్నా కు ప్రాతినిధ్యం ఉండే విధంగా చూడాలని కోరడం జరిగింది. వినతి పత్రం సమర్పించిన వారిలో సామ్నా ప్రధాన కార్యదర్శి సిహెచ్. రమణారెడ్డి, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు  దారం వెంకటేశ్వరరావు, సామ్నా జాయింట్ సెక్రెటరీ మల్లెల శ్రీనివాస్, విజయవాడ చిన్న పత్రికల సంఘం అధ్యక్షుడు ఎం వి సుబ్బారావు, ఉపాధ్యక్షుడు విఎల్ నర్సారెడ్డి  ఉన్నారు.