వింజమూరులో చిన్నారులకు వ్యాక్సినేషన్*

*వింజమూరులో చిన్నారులకు వ్యాక్సినేషన్*


వింజమూరు:


వింజమూరులోని పాత ప్రభుత్వాసుపత్రిలో వి.హెచ్.యన్.డి ప్రోగ్రాం లో భాగంగా బుధవారం నాడు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది నేతృత్వంలో 5 సంవత్సరాల లోపు చిన్నారులకు వ్యాక్సినేషన్లు వేశారు. 28 మంది చిన్నారులకు వ్యాక్సిన్లు, చుక్కల మందులను వేయడంతో పాటు గర్భవతులకు ఏ.బి.సి పరీక్షలు నిర్వహించారు. హైరిస్క్ కేసులు నమోదు కాలేదని అలాంటి వారిని ముందుగానే గుర్తించి అవసరమైన చర్యలను చేపడుతున్నామని ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య సిబ్బంది తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సి.హెచ్.ఒ గిరి కుమారి, సూపర్ వైజర్లు ప్రభావతి, వెంకటేశ్వర్లు, యు.డి.సి అంబటి.వెంకటేశ్వర్లు రెడ్డి, హెచ్.సి ఎన్.వెంకటేశ్వర్లు, ఏ.యన్.యం లు, ఆశా వాలంటీర్లు పాల్గొన్నారు...