విజయవాడ నగర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్. ఈరోజు తన కార్యాలయం నుంచి విడుదల చేసిన ప్రకటనలో తెలియజేసినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2019వ సంవత్సరం రాష్ట్ర ప్రజలందరికీ బ్యాడ్ఇయర్ ఎందుకంటే ప్రజలకు ఉపాధి అవకాశాలు లేక తీవ్రమైన నిరాశ నిస్పృహలకు లోనవుతు తాము చేసిన తప్పుకి మధన పడుతూన్నారని , జగన్మోహన్ రెడ్డి గారికి పాలన చేతకాక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని , 2020 వ సంవత్సరంలో అయినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి మంచి పరిపాలన అందించి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలని లేదంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి చివరి అవకాశమని హెచ్చరించారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకునే వైఎస్ఆర్సిపి కి ఇక ఈ రాష్ట్రంలో రాజకీయ భవిష్యత్తు ఉండదని ప్రజలు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి పాలన పై తీవ్రమైన టువంటి అసంతృప్తితో ఉన్నారని ఇకనైనా జగన్మోహన్ రెడ్డి గారు తన తీరు మార్చుకోవాలని హితవు పలికారు.
అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులకు పవన్ కళ్యాణ్ గారు అండగా నిలబడితే వారు చేస్తున్న పోరాటానికి మద్దతు పలికితే వైఎస్ఆర్సిపి నాయకులు ఎందుకు అంత కడుపుమంట అర్థం కావడం లేదని వారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ గా తయారు చేసుకునేందుకు రైతుల భూములు త్యాగం చేస్తే వారి త్యాగాన్ని అపహాస్యం చేసే విధంగా వైఎస్సార్ సీపీ నాయకులు చేస్తున్న చౌకబారు విమర్శలు ప్రజలందరూ గమనిస్తున్నారని రైతుల కనీళ్ళలో ఈ ప్రభుత్వం కొట్టుకుపోయే రోజులు తొందరలోనే ఉన్నాయి అని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ గారి పై చౌకబారు విమర్శలు చేస్తున్న వైఎస్ఆర్సిపి నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని లేదంటే వారికి ప్రజలే తగిన సమయంలో తగిన రీతిలో లో సమాధానం చెప్తారని హెచ్చరించారు.