*గుండెమడగలలో 12 న ఎన్.టి.ఆర్ విగ్రహావిష్కరణ* వింజమూరు: వింజమూరు మండలంలోని గుండెమడగల గ్రామంలోని ఎన్.టి.ఆర్ నగర్ లో ఈ నెల 12 వ తేదీన గురువారం ఉదయం 9 గంటలకు దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి.తారక రామారావు నూతన విగ్రహ ప్రతిష్టా మహోత్సవము జరుగుతుందని వింజమూరు మండల టి.డి.పి కన్వీనర్ చల్లా. వెంకటేశ్వర్లు యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిధిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చెన్నైలో ఉంటున్న గుండెమడగల వాసి కుంకు.కొండయ్యనాయుడు అధ్వర్యంలో విగ్రహావిష్కరణ ఉంటుందన్నారు. ముఖ్య అతిధులుగా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి వర్యులు సోమిరెడ్డి.చంద్రమోహన్ రెడ్డి, టి.డి.పి జిల్లా అధ్యక్షులు, శాసన మండలి సభ్యులు బీదా. రవిచంద్ర యాదవ్, రాష్ట్ర తెలుగు రైతు సంఘం అధ్యక్షుడు కంభం.విజయరామిరెడ్డి, ఉదయగిరి మాజీ శాసన సభ్యులు బొల్లినేని. వెంకట రామారావు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పొన్నెబోయిన.చెంచలబాబు యాదవ్, ఉదయగిరి నియోజకవర్గ టి.డి.పి పరిశీలకులు ఊరందూరు. సురేంద్రబాబు, పమిడి.రవికుమార్ చౌదరిలు హాజరవుతారన్నారు. ఈ సమావేశంలో స్థానిక నేతలు చిలకల.వెంకటరెడ్డి, మండాది.గంగిరెడ్డి, గురజాల.వాసు, డబ్బుగుంట.హరిబాబు తదితరులు పాల్గొన్నారు.
గుండెమడగలలో 12 న ఎన్.టి.ఆర్ విగ్రహావిష్కరణ