11.12.19
అమరావతి
*టీడీపీ హయాంలో 264 కన్సల్‌టెంట్ల పోస్టులు నియామకం*
*వందల కోట్లు కన్సల్‌టెంట్లకు ఖర్చు చేశారు*
*నామినేటెడ్ పోస్టుల్లోనే కాదు.. నామినేటెడ్ పదవుల్లోనూ 50% రిజర్వేషన్లు*
*నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి*
*సమర్థత, వృత్తి నైపుణ్యం ఆధారంగా అడ్వైజర్ల నియామకం*
*జస్టిస్ ఈశ్వరయ్య, ఫ్రొఫెసర్ లక్ష్మమ్మ, భార్గవ్ రామ్‌ను నియమించారు*
*టీడీపీ హయాంలో అడ్వైజర్లు, కన్సలెంట్ల పేరుతో వందల కోట్లు ఖర్చు చేశారు*
*చంద్రబాబుకే బంధుప్రీతి, ప్రాంతీయ ప్రీతి, కులప్రీతి ఉన్నాయ్*
*- మంత్రి కురసాల కన్నబాబు*
సలహాదారులు, సీఈఓల నియామకాల విషయంలో రిజర్వేషన్లపై ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ సభ్యుడు అనగాని సత్యప్రసాద్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిపై మంత్రి కురసాల కన్నబాబు సమాధానం ఇస్తూ.. మొదటి ప్రశ్న 'ఏ'కు ఛైర్మన్లు 25, అడ్వైజర్లు 26, సీఈఓలు 2, అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల్లో 21 మందిని నియమించటం జరిగిందన్నారు. బీ, సీ ప్రశ్నలకు సమాధానం ఇది ఉత్పన్నం కాదని కన్నబాబు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన సమాధానంపై అనగాని అసంతృప్తి వ్యక్తం చేస్తూ కులాలు గురించి మాట్లాడటం ఇష్టం లేదంటూనే..70 పదవులు ఒకే సామాజిక వర్గానికి కట్టబెడుతున్నారంటూ ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి కురసాల కన్నబాబు దేన్ని అయినా వక్రీకరించటంలో టీడీపీ వాళ్లను మించిన వారు దేశంలో ఎవ్వరూ ఉండరని అన్నారు. ఈ ప్రశ్న వచ్చిన సందర్భంగా గతంలో ఏం చేశారో తెల్సుకునే ప్రయత్నం చేశామని అయితే ఆనాటి ప్రభుత్వం సమాచారం అంతా ఒక్కచోట లేకుండా జాగ్రత్త పడ్డారని అన్నారు. పోస్టులు అన్నీ అక్కడక్కడ ఇచ్చారు. అలా 24 శాఖల్లో చూస్తే.. 264 కన్సల్‌టెంట్ పోస్టులు ఇచ్చారని కన్నబాబు తెలిపారు. టీడీపీ సభ్యుడు సామాజిక వర్గాల గురించి మాట్లాడుతున్నారు. సీఎం శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు.. అన్ని సామాజిక వర్గాల వారికి పదవులు ఇచ్చారని ఈ సందర్భంగా నందమూరి లక్ష్మీపార్వతి, రాజీవ్‌కృష్ణ, వాసిరెడ్డి పద్మ, జక్కంపూడి రాజా పేర్లను కన్నబాబు ప్రస్తావించారు. ఎస్సీకార్పొరేషన్ పదవిని ఎస్సీ మహిళకు, రెల్లి కార్పొరేషన్, మాదిగ కార్పొరేషన్ పదవులు ఆ సామాజిక వర్గాల వారికి ఇచ్చారన్నారు. అడ్వైజర్లను టీడీపీ వారే కులాన్ని, మతాన్ని చూసి నియమించుకుంటారు కానీ మేము మాత్రం ఆయారంగాల నిపుణుల సమర్థతను బట్టి ఎంపిక చేసుకొని సలహాలు, సూచనలు తీసుకుంటామని అన్నారు. అవి శాశ్వతమైన పోస్టులు కావని కన్నబాబు తెలపారు. ఆ పోస్టులు ఒక కాలపరిమితి లోబడి ఉండే పోస్టులు అని వివరించారు. కావాలంటే పూర్తి సమాచారాన్ని స్పీకర్ గారికి పంపుతామని మంత్రి కన్నబాబు అన్నారు. వాళ్లకు అనుకూలంగా ఉండే కొన్నిపేర్లు మాత్రమే చెబుతున్నారు అని కన్నబాబు మండిపడ్డారు. అయితే, టీడీపీ హయాంలో నియమించిన అడ్వైజర్లు కొందరిని ఇప్పుటికీ కొనసాగుతున్నారని కన్నబాబు అన్నారు. ఉదాహరణకు వ్యవసాయ శాఖలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టీ విజయ్‌కుమార్ గారిని ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఎక్కడో కావాల్సిన వారిని పెట్టుకోవాలని కులాలు, మతాలో చూస్తే 151 సీట్లు రావు అని కన్నబాబు అన్నారు.
దేవాదాయ కమిటీల నుంచి మార్కెట్ కమిటీల వరకు ప్రతి చోట ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం వైయస్ జగన్ మోహన్ గారిది అని కన్నబాబు పేర్కొన్నారు. నామినేటెడ్ పోస్టుల్లోనే కాదు.. నామినేటెడ్ పదవుల్లోనూ 50% రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించారు. ఇవేమీ టీడీపీ వాళ్లకు కనిపించవని మంత్రి కన్నబాబు ఎద్దేవా చేశారు. ఇందులో అందరూ ఉన్నారు. వాళ్ల కంటికి కొందరు మాత్రమే కనిపిస్తున్నారు. అడ్వైజర్లు, కన్సలెంట్ల పేరుతో వీరు వందల కోట్లు ఖర్చు చేశారు. అంతేకాకుండా పెద్ద పెద్ద సంస్థలైన కేపీఎంజీ, యర్నెస్ట్ అండ్ యంగ్ వాటిని తెచ్చి కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. బ్లూఫ్రాగ్, ఎల్లోఫ్రాగ్ సంస్థలు ఉండనే ఉన్నాయి. అడ్వైజర్లను సమర్థతను బట్టి.. అవకాశాన్ని బట్టి తీసుకుంటారని ఇందులో అందరూ ఉన్నారని కన్నబాబు వివరించారు. టీడీపీ సభ్యులు అడ్వైజర్ల పేరు అడుగుతున్నారు. కావాలంటే వారి పేర్లు కూడా చెబుతానని .. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు ఉన్నారు. ఏపీ హైయ్యర్ ఎడ్యుకేషన్‌కు రెగ్యులేటరీ మానిటరింగ్ కమిటీకి జస్టిస్ ఈశ్వరయ్యను నియమించారు. ఫ్రొఫెసర్ లక్ష్మమ్మ, భార్గవ్ రామ్ వీళ్లు అందరూ ఎవరు? వీళ్లను ఏం చూసి తీసుకున్నారు? కేవలం కులాన్ని, అవసరాన్ని, రాజకీయాలు చూసి తీసుకునే అడ్వైజర్లు తీసుకునే చరిత్ర వాళ్లది. బీజేపీ అధికారంలో ఉండగానే ప్రేమ పుట్టుకువచ్చి మీడియా అడ్వైజర్‌గా ఒకాయనను నియమించుకున్నారు. కానీ ఈ ప్రభుత్వం అలాంటి ప్రభుత్వం కాదు. ఎవరైతే సమర్థత ఉంటుందో, ఎవరైతే గట్టిగా పనిచేస్తారో వారిని నియమిస్తారు.
బీసీ జస్టి్‌స్‌ను అవమానపరిచన చరిత్ర టీడీపీ వారిదని కన్నబాబు మండిపడ్డారు. పీటర్ లాంటి అనుభవజ్ఞుల్ని తీసుకువచ్చి నియమిస్తే టీడీపీ చేస్తున్న వాదనలో పసలేదని కన్నబాబు మండిపడ్డారు. కన్సల్టెంట్ల పేరిట వారి బంధువులకు, అనుయాయులకు టీడీపీ హయాంలో పదవులు ఇచ్చుకున్నారు. బంధుప్రీతి, ప్రాంతీయ ప్రీతి, కులప్రీతి ఎవరికి ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు పేరు చెబుతారు. ఈ ప్రభుత్వం అవసరం ఉన్నమేరకే అడ్వైజర్లను నియమించుకుందని కన్నబాబు వివరించారు. అందులో కొన్ని పేర్లను సభలో చదివి వినిపించారు.
శ్రీ జక్కంపూడి రాజా, రాజానగరం ఎమ్మెల్యే, కాపు కార్పొరేషన్ ఛైర్మన్
జస్టిస్ ఏ శంకరనారాయణ, ఛైర్‌పర్సన్ ఫర్ ద పర్మినెంట్ ఏపీ కమిషన్ ఫర్ ద బిసీస్.
శ్రీమతి ఆర్కే రోజా, ఛైర్‌పర్సన్, ఏపీఐఐసీ
రాజీవ్ కృష్ణ, అడ్వైజర్
కృష్ణ జీవీ గిరి, అడ్వైజర్
శ్రీధర్ లంకా, అడ్వైజర్
అప్పసాని కృష్ణారావు, అడ్వైజర్
వెంకటరమణి భాస్కర్, అడ్వైజర్ ఫైనాన్స్ అండ్ రిసోర్స్
బి చంద్రశేఖర రెడ్డి, ఛైర్మన్ ఏపీ స్టేట్ మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్
వెంకట్ చంగవల్లి
శిల్పా చుక్కపల్లి
నందమూరి లక్ష్మీపార్వతి, ఛైర్‌పర్సన్ ఏపీ తెలుగు అకాడమీ
యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
కె.హేమచంద్రారెడ్డి, ఛైర్మన్ ఏపీ హైయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్.. ఇలా చాలా వివరాలు ఉన్నాయి. ఇందులో దాపరికం ఏమీ లేదని కన్నబాబు సమాధానాన్ని ముగించారు.