*నిబంధనలు సడలించాలి. గడువు పొడిగించాలి కమిషనర్ కు ఏపీయుడబ్ల్యూ జే..... డిమాండ్.*
*రాష్ట్రంలో చేపట్టిన జర్నలిస్టుల కు అక్రిడేషన్ లు జారీ చేసే ప్రక్రియ లో నిబంధనలు సడలించి, దరఖాస్తు చేసుకునే గడువును పెంచాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ( ఏపీయుడబ్ల్యూ జే) డిమాండ్ చేసింది. ఆ మేరకు శుక్రవారం సమాచార శాఖ కమిషనర్ విజయకుమార్ రెడ్డి ని యూనియన్ నాయకులు కలసి వినతిపత్రం ఇచ్చారు.*
*యూనియన్ రాష్ట్ర అధ్యక్ష , ప్రధానకార్యదర్శి ఐ. వి. సుబ్బారావు, చందు జనార్దన్, iju ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, కార్యవర్గ సభ్యులు ఆలపాటి సురేష్ కుమార్ లు కమిషనర్ ను కలసి సమస్యలను వివరించారు.*
*ప్రస్తుత విధానంలో జనవరి 1 వ తేదీకి మొత్తం జర్నలిస్టు లకు అక్రిడేషన్ లు ఇచ్చే పరిస్థితి కనిపించటం లేదని తెలిపారు. On లైన్ తో పాటు జర్నలిస్టులు నేరుగా దరఖాస్తు చరసుకొనే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేసారు.*
*దరఖాస్తు చేసుకునే గడువును ఈ నెల 25 వరకు పొడిగించాలని కోరారు. చిన్న పత్రికలకు gst సర్టిఫికేట్ దాఖలు విధానం అమలుకు కనీసం ఒక సంవత్సరం గడువు ఇవ్వాలని సూచించటం జరిగింది.*
*తిరుపతి లో ఉన్న తమిళనాడు ఎడిషన్ ల కు సంబంధించిన డెస్క్ జర్నలిస్టుల కు అదనంగా అక్రిడేషన్ లు ఇవ్వాలని కొరటం జరిగింది.*
*నిబంధనలు సడలింపుకు సంబంధించి కమిషనర్ మాట్లాడుతూ ఇక నుండి అక్రిడేషన్ లు ఇచ్చే ప్రక్రియ నిరంతరం కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.*
*తొలి విడతగా 20 వరకు తీసుకొని అవసరమైతే మళ్ళీ వారం రోజులలో దరఖాస్తు లు చేసుకునే ప్రక్రియ పునఃప్రారంభం చేస్తామన్నారు. Id కార్డులు అవసరం లేదని, స్టేట్ అక్రిడేషన్స్ కు ఆఫీస్ నుండి ఇచ్చే జాబితా, మండల రిపోర్టర్స్ జిల్లా బ్యూరో ఇంచార్జెస్ ఇచ్చే జాబితాలను జతపరిస్తే సరిపోతుందన్నారు.*
*కొత్తవారు, అందునా విద్యార్హత లేనివారు మాత్రమే ఎడిటర్ లేఖ నెట్ వర్క్ ఇంచార్జి ఇచ్చే గుర్తింపు లెటర్ చూపాలని కోరారు.*
*రెన్యూవల్ చేసుకునేవారికి పాత అక్రిడేషన్ ఒకటే కొలమానం అని చెప్పారు.*
*చిన్న పత్రికల వారు 6 నెలల ప్రింటింగ్ కు gst సర్టిఫికేట్ ఇస్తే చాలు అని, yఏడాది గడువు విషయం పరిశీలిస్తామని చెప్పారు.*
*అయితే జనవరి 1 కి కొత్త అక్రిడేషన్ లు ఇవ్వాలన్న హడావుడి తప్ప, అందరికి అక్రిడేషన్స్ ఇవ్వాలన్న చిత్తశుద్ధి కనిపించలేదు.*
*అందువలన అవసరమైతే ఆందోళనలకు సిద్ధంగా ఉండాలని జర్నలిస్టుల కు సూచిస్తున్నాము.*
*ఐ. వి. సుబ్బారావు,* *అధ్యక్షుడు*