*వివాహితపై గ్రామ వాలంటీర్ అత్యాచారయత్నం*
కలిగిరి: ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి మండలం వీర్నకొల్లు గ్రామ దళితవాడలో రైతు భరోసా పధకంపై వివరాల కోసం వెళ్ళి ఒక వివాహిత మహిళపై అత్యాచారయత్నానికి ఒడిగట్టిన గ్రామ వాలంటీర్ ఉదంతం మంగళవారం నాడు వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే వీర్నకొల్లు గ్రామంలో వాలంటీరుగా పనిచేస్తున్న నిమ్మకంటి.వాలీ స్థానిక దళిత వాడలో నివాసముంటున్న నిమ్మకంటి.సంధ్య ఇంటికి గత రాత్రి పట్టాదారు పాసుపుస్తకాల వివరాల కోసం వెళ్ళాడు. వరుసకు వదిన అయిన సంధ్యతో రైతు భరోసా పధకంలో అర్హురాలిగా చేరుస్తానని, పాసు పుస్తకాలు కావాలని కోరాడు. సంధ్య పాసు పుస్తకాలను తీస్తుండగా వాలంటీర్ వాలీ ఆమెపై అత్యాచార యత్నానికి పాల్బడినట్లు తెలిసింది. వెంటనే తేరుకున్న సంధ్య బిగ్గరగా కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. స్థానికులను పసిగట్టిన వాలంటీర్ వాలీ అక్కడి నుండి జారుకున్నాడు. ఈ విషయమై సంధ్య కలిగిరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే అప్రమత్తమైన ఎస్.ఐ ఆదిలక్ష్మి విచారణ ముమ్మరం దిశగా నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించి వాలీపై కేసు నమోదు చేశారు. భాధ్యతాయుతమైన వాలంటీర్ ఇలాంటి దురాగతానికి ఒడిగట్టిన వైనం స్థానికంగా తీవ్ర చర్చానీయాంశమైంది.......