సెక్యూరిటీ డ్రిల్‌ను అధికారులు ఫాలో అయ్యారు

13.12.19
అమరావతి


*సెక్యూరిటీ డ్రిల్‌ను అధికారులు ఫాలో అయ్యారు*
*సమూహంగా వస్తే సభ్యులను గుర్తించటానికి ఆపారు*
*సెక్యూరిటీ సిబ్బందితో ప్రతిపక్ష నేత తీరు సరికాదు*
*ఉద్యోగస్తులపై చంద్రబాబు వాడిన పదజాలం అభ్యంతరకరం*
*గతంలో ప్రతిపక్షనేతను ఇబ్బందిపెట్టినా కించిత్‌ మాట కూడా అనలేదు*
*గతంలో ఆర్కే రోజా, చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై వ్యవహరించిన తీరు గుర్తు చేసిన బుగ్గన* 
*జరిగిన ఘటనపై చంద్రబాబు కనీసం పశ్చాత్తాపం వ్యక్తం చేయటం లేదు*
*గేట్‌ 2 ద్వారా చంద్రబాబు నాయుడు రావాలి*
*బాబుకు అన్యాయం జరిగినట్లు పత్రికలు వక్రీకరించాయి* 
*చంద్రబాబు అన్నవి అన్నీకరెక్టేనా?*
*పశ్చాత్తాపం చెప్పకుండా ఎదురుదాడి ఏంటి?*
*ఫ్లకార్డ్స్‌ తేవటంపై సభలో రూల్స్‌ ఉన్నాయి* 
*సభ్యులు తెస్తుంటారు. మార్షల్స్‌ వారిని కంట్రోల్‌ చేస్తుంటారు* 
*సంఖ్యా బలాన్ని బట్టి సమయం కేటాయిస్తారు*
*ప్రతిపక్ష సంఖ్యను బట్టి సమయం కేటాయిస్తారు*


*- శాసనసభ, ఆర్థిక శాఖామాత్యులు బుగ్గన రాజేంద్రనాథ్‌* 


నిన్న జరిగిన సంఘటనపై మొదట్లో ఆ వీడియో క్లిప్పులు చూసినప్పుడు అంత క్లియర్‌గా సంభాషణ, భాష అప్పుడు అర్థం కాలేదని బుగ్గన రాజేంద్రనాథ్‌ అన్నారు. కానీ ఇప్పుడు ఆ వీడియోలు చూస్తే ఎంతో దారుణం అని బుగ్గన 
రాజేంద్రనాథ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక చీఫ్‌ మార్షల్‌ను, ఇతర అధికారులను, సభ్యులకు భద్రత కల్పించేవారిని పట్టుకొని చంద్రబాబు వ్యవహరించేది వ్యవహరించేదని ఇలానా అని బుగ్గన ప్రశ్నించారు. సెక్యూరిటీ వాళ్లు 
చేసిన పాపం అంతా సెక్యూరిటీ డ్రిల్‌ ప్రకారం ఫాలో అవటమేనా అన్నారు. ఒక సమూహం గుమ్మిగూడి శాసనసభలోకి వస్తే యాక్సెస్‌ కంట్రోల్‌ చేసి ఎవరు సభ్యులో వారిని మాత్రమే లోపలికి అనుమతించాలి అనేది సెక్యూరిటీ 
డ్రిల్‌ చెబుతోందని బుగ్గన వివరించారు. అయితే దాన్ని పట్టించుకోకుండా.. ఒరేయ్‌.. ఎవ్వర్రా నువ్వు? ఒరేయ్‌ అన్‌ఫిట్‌.. అని అనటం, అంతటితో వదిలిపెట్టకుండా.. బాస్టర్డ్‌ అనటం ఎంతదారుణం అని బుగ్గన మండిపడ్డారు. 
యూజ్‌లెస్‌ ఫెలో అని ఒకరు అంటే, మరొకరు వచ్చి తోస్తే.. ఇంకొకరు వచ్చి షర్ట్‌ కాలర్‌ పట్టుకుంటారని బుగ్గన ఆ ఘటనలను తెలిపారు. తనకు తెల్సి ఏ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇలా జరిగి ఉండవని బుగ్గన అన్నారు. గత సభలో 
ప్రతిపక్షనాయకులకు ఎంత అవమానం జరిగినా లోపలికి రానివ్వకపోయినా హుందాగా బయట కూర్చున్నాం తప్ప కించిత్ ఒక్కమాట కూడా అనలేదని గుర్తు చేశారు. అప్పటి ప్రతిపక్ష నాయకులు ఒకసారి సభలోకి వస్తుంటే 
లోపలికి రానివ్వకపోతే అందరం బయట కూర్చున్నామన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక వ్యక్తిని ఒక్కరోజు ప్రతిపక్షనేత కానీ సభ్యుడు ఒరేయ్‌ అన్నమాట అనలేదని బుగ్గన అన్నారు. ఇదేం భాష అని బుగ్గన ఆశ్చర్యం వ్యక్తం 
చేశారు.  ఏపీ రాష్ట్ర చరిత్రలో ఏనాడూ ఇలాగా జరగలేదని గతంలో ఆర్కే రోజా, చెవిరెడ్డి భాస్కరరెడ్డిని బయట ఎత్తి పడేస్తే.. ఆసుపత్రిలో చేరారని గుర్తు చేశారు. గతంలో ఎన్నో అవమానాలు జరిగాయని బుగ్గన తెలిపారు. ఈ 
సందర్భంగా నిన్నటి ఘటనలో మార్షల్‌కు తగిలిన దెబ్బలు, తోసినవి, లోకేశ్‌ సెక్యూరిటీ గొంతు పట్టుకొన్న ఫొటోలను బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చూపించారు. 


జరిగిన ఘటనపై ఇప్పటికీ పశ్చాత్తాపం లేదు. పొరపాటు అయిందని గానీ చెప్పడం లేదు. పైగా ప్రతిపక్షం ఎదురుదాడి చేస్తోందని బుగ్గన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏపీ రాష్ట్ర ప్రజలు ఎవరైనా నిన్నటి ఘటనపై మీడియా రిపోర్టింగ్‌ 
చూస్తే ఎంతటి అన్యాయం జరిగింది. ప్రతిపక్షాన్ని లోపలికి రానివ్వలేదు. కాబట్టి ధర్నా చేశారని అనుకునేలా ఉందని అన్నారు. వాస్తవం ఏమిటి అంటే.. తను రావాల్సిన రూట్‌లో ప్రతిపక్ష నేత చంద్రబాబు రాకుండా జనాన్ని 
వేసుకొని హౌస్‌ మీదకు వస్తుంటే సెక్యూరిటీ వాళ్లు తమ డ్యూటీ చేస్తుంటే ఒరేయ్‌.. అన్‌ఫిట్‌ ఫెలో, యూజ్‌లెస్‌ ఫెలో, బాస్టర్డ్‌, షర్ట్‌ కాలర్‌ పట్టుకోవటం చేశారని బుగ్గన కడిగేశారు. పేపర్లు చదివితే ప్రతి దాన్నీ వక్రీకరించాయని 
బుగ్గన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈరోజు ఈ వీడియోలు చూస్తే ఎంతో క్లియర్‌గా కనబడుతోందని మనకు భద్రత ఇవ్వాల్సిన వారితో వ్యవహరించిన తీరు బట్టబయలైందని బుగ్గన తెలిపారు. ఎలాంటి సంకేతాలను సభ్యులుగా 
మనం పంపిస్తున్నామని బుగ్గన ప్రశ్నించారు. దీనిపై సభ దీనిపై నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ ఘటన ... సభ మీద, స్పీకర్‌ మీద, ఏపీ రాష్ట్ర ప్రజల మీద జరిగిందని బుగ్గన అన్నారు. దీనికి తగిన నిబంధనల ప్రకారం.. చట్టం 
ప్రకారం, రూల్స్ ప్రకారం.. ఏ చర్యలు తీసుకోవాలో స్పీకర్‌కే సభ నిర్ణయాధికారం వదిలిపెడుతోందన్నారు. ఏం చర్యలు చేపట్టాలో.. చట్ట ప్రకారం తీసుకొని ఇకపై ఎవ్వరూ ఇటువంటి చర్యలకు పాల్పడకుండా కఠినమైన చర్యలు 
తీసుకోవాలని సభ అంతా తీర్మానం చేస్తోందని బుగ్గన రాజేంద్రనాథ్‌ తెలిపారు. 


అసలు చంద్రబాబు నాయుడు ఉన్మాది అనటం కరెక్టా? ఒరేయ్‌ యూజ్‌లెస్‌ ఫెలో అనటం కరెక్టా? రాస్కెల్‌ అనటం కరెక్టా? బాస్టర్డ్‌ అనటం కరెక్టా? బాస్టర్డ్‌ అనేదానికి తెలుగులో ఏ అనువాదం వస్తుంది. ఇవన్నీ వాడేమాటలేనా? 
మనిషిని తోయటం కరెక్టా? మనిషిని గొంతుపట్టుకోవటం కరెక్టా? వీటన్నింటికీ ప్రతిపక్షనేత చంద్రబాబు సమాధానం చెప్పాలని బుగ్గన డిమాండ్‌ చేశారు. ఇప్పటికే చంద్రబాబు అన్నారా..  తోశారా లేదా అన్నది వీడియోలతో 
రుజువు అయిపోయింది. అది కరెక్ట్‌ అయితే పశ్చాత్తాపం ఏవిధంగా తెలియపరుస్తారో చెప్పాలని బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి కోరారు. 


మరోసారి చంద్రబాబు ఉన్మాది అన్న వీడియోను, అధికారులను లోకేశ్, చంద్రబాబు తిట్టిన వీడియోలు సభలో ప్లే చేశారు. బాబు అన్న మాటలు అందరూ విన్నారు. దీనిపై చంద్రబాబు క్లారిటీ ఇవ్వాలని బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి 
కోరారు. ఎంతో క్లియర్‌గా తలుపు తీయి.. బాస్టర్డ్‌.. అసెంబ్లీకి పోకూడదా.. ఇంత క్లియర్‌గా చంద్రబాబు అన్నారు. తర్వాత తోయటం లోకేశ్‌ నాయుడు యూజ్‌లెస్‌ ఫెలోస్‌ అనటం, గొంతుపట్టుకోవటం, ఇంకో సభ్యుడు కాలర్‌ 
పట్టుకోవటం దుర్మార్గం. రాష్ట్రం ఏమైపోతుంది. ప్రతిపక్ష నాయకులు క్లారిటీ ఇవ్వాలి. ఈ పదజాలం ఇదంతా వాడటం కరెక్టా? బాస్టర్డ్‌ అనేపదాన్ని అనువాదం చేస్తే ఎంత దూరం వెళ్లిపోతుందని బుగ్గన మండిపడ్డారు. 


ఇప్పటికైనా గౌరవ ప్రతిపక్షనాయకులు ఒక్కసారి రాష్ట్రాన్ని పరిగణలోకి తీసుకొని నిన్న పొరపాటుకు కారకులు అయ్యారో, రక్షణ కల్పిస్తున్నారో వారి మీద ప్రవర్తించిన విధానానికి క్షమాపణ చెబితే బావుంటుంది. తను 
అంగీకరించి క్షమాపణ చెప్పి బాధ్యత తీసుకుంటుందో బావుంటుంది. లేనిపక్షంలో సభ తీర్మానం చేయటానికి సిద్ధంగా ఉందని బుగ్గన అన్నారు. 


టీడీపీ సభ్యులు సమూహంగా వస్తుంటే గేట్లు తెరిచి పెట్టి ఆహ్వానించాలా? కారాగారం మాదిరి అని టీడీపీ సభ్యులు అంటారు. గేట్లు పెట్టించింది ఎవరు? బిల్డింగ్‌ కట్టించింది చంద్రబాబే అని బుగ్గన గుర్తు చేశారు. ఆ డిజైన్‌ వారిదే 
అన్నారు. ఫ్లకార్డ్స్‌ తేవటంపై అప్పుడు ఇప్పుడు రూల్స్‌ ఉన్నాయి. తెస్తుంటారు. దాన్ని మార్షల్స్‌ కంట్రోల్‌ చేస్తుంటారు. తెచ్చిన ప్లకార్డ్స్‌ కంట్రోల్‌చేయటం మార్షల్స్‌ బాధ్యత అని ఇదొక కంటిన్యూస్‌ ప్రాసెస్‌ అన్నారు. దీనిపై రూల్‌ 
ఉందని బుగ్గన వివరించారు. ఈరోజు కూడా టీడీపీ సభ్యుల వద్ద ఫ్లకార్డులు ఉన్నాయి. ఎక్కడ నుంచి వచ్చాయి. మార్షల్స్‌ డ్యూటీ. ట్రాఫిక్‌ కంట్రోల్‌ చేయటం ట్రాఫిక్ కానిస్టేబుళ్ల డ్యూటీ. దాన్ని కూడా తప్పు అంటే ఎలా అని 
ప్రశ్నించారు. సభ్యులు రామానాయుడు ఇప్పటికీ ఫ్లకార్డ్స్‌ చూపిస్తున్నారని బుగ్గన అన్నారు. ఆశ్చర్యం ఏమిటి అంటే హ్యుమియలేట్‌ అంటున్నారు. అస్సలు ఎవరు హ్యుమియలేట్‌ చేస్తున్నారు. వాస్తవానికి టీడీపీ సభ్యులు ఎన్ని సబ్జెక్ట్‌ ఉచ్చారో వాటిలో చాలా వరకు సబ్జెక్ట్స్‌ బిల్లు, షార్ట్‌ డిష్కషన్స్‌, షార్ట్‌ నోటీస్‌ క్వశ్చన్‌ రూపంలో తెస్తున్నామని వివరించారు. దాన్ని హ్యుమియలేట్‌ అంటే ఏమంటారు. మామూలుగా రూల్స్‌ ఏమంటాయి. సంఖ్యా బలాన్ని బట్టి స్పీకర్లు. సంఖ్యాబలం బట్టి టైం. ప్రతిపక్షానికి కూడా సంఖ్యను బట్టి టైం ఇస్తారు. మాకు సమయం రాలేదు అంటే ఎలా? ఎందుకు లేదు పౌరుషం అని గతంలో చంద్రబాబు అన్న మాటల్ని బుగ్గన ప్రస్తావించారు. నేను చండశాసనుడిని. నేను తలచుకుంటే ఇది చేసేస్తా. తాటతీసేస్తా. గుండెల్లో నిద్రపోతా. అంతు చూస్తా అన్నారు. అధికారుల గుండెల్లో నిద్రపోతా అంటే.. పాపం.. ఇంట్లో నిద్రపోవటం లేదేమో అధికారుల గుండెల్లో నిద్రపోతా అంటున్నారని గతంలో రోశయ్య అన్న సంగతిని బుగ్గన గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఏపీ శాసనసభా ప్రాంగణంలో నిన్న జరిగిన సంఘటనలో ప్రమేయం ఉన్న శాసనసభ్యులు, ఇతరులు అందరిపైన సముచితమైన చర్యలు తీసుకొని సభా గౌరవాన్ని, సిబ్బంది భద్రతను, గౌరవాన్ని పరిరక్షించే అధికారాన్ని సభాపతికి సంక్రమింపజేస్తూ ఈ సభ తీర్మానిస్తోందని బుగ్గన తెలిపారు.


Popular posts
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు
ఎస్కేప్ చానల్ నుండి రెండో పంటకు నీళ్ళు విడుదల చేసిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
Image
నెల్లూరు నగరములో చోరీ::వృద్దురాలిపై దాడిచేసి బంగారు నగలు అపహరణ.
Image