*11.12.2019*
*అసెంబ్లీ*
*ఎయిడెడ్ స్కూళ్లలో ఖాలీలు భర్తీ, ఉపాధ్యాయుల సమస్యలు, ఆక్రమణలపై విద్యాశాఖ మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్*
ఎయిడెడ్ కాలేజీలు,స్కూల్స్, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో..
ప్రభుత్వం సామాజిక బాధ్యతలో భాగంగా ఈ ప్రైవేటు ఆర్గనైజేషన్‌లో కూడా విద్యా సంస్ధలను ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశ్యంతో ఉంది. అందుకే ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్‌ను ఇవ్వడం జరిగింది. ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్ స్కూల్స్ క్రమేణా పెరగడం వలన స్కూల్స్‌లో, కాలేజీల్లో, డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్నటు వంటి అధ్యాపకుల స్ధితిగతులు ఆన్ ఫార్ విత్ గవర్నమెంట్, వాళ్లకివ్వాల్సినటువంటి ఆటోమేటిక్ అడ్వాన్స్ ఇంక్రిమెంట్, కేరియర్ అడ్వాన్స్‌డు స్కీం కానివ్వండి, ఫెన్సనర్ బెనిఫిట్స్ కానివ్వండి, పీరియాడిక్ పే రివిజన్స్ కానివ్వండి ఇలాంటివి అన్నీ ఎయిడెడ్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులకు కూడా ఎక్స్‌టెన్సన్ చేయడం జరిగింది. దానివల్ల ఫైనాన్సియల్ బర్డెన్ కూడా ప్రభుత్వం మీద పెరిగింది. ఇక్కడ ప్రధానంగా ఈ ఎయిడెడ్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకుల స్ధితిగతులను, శాలరీస్ కానియ్యండి, ఇతర ఫైనాన్సియల్ కమిట్‌మెంట్స్ అనేది మేనేజిమెంట్స్ బాధ్యత. దీనికి ప్రత్యేకమైన రూల్స్ ఉన్నాయి అధ్యక్షా..
ఏపి ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్‌మెంట్ రికగ్నేషన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ రూల్స్ (1987) ఉన్నాయి.
ఆ రూల్స్ ప్రకారం పేమెంట్ ఆఫ్ శాలరీస్ టూ స్టాప్, ద ఎడ్యుకేషనల్ ఏజెన్సీ ఆఫ్ ఎనీ ప్రైవేటు ఇనిస్టిట్యూషన్స్ షెల్ పే శాలరీస్ టూ స్టాప్ యాజ్ పెర్ ది గవర్నమెంట్ స్కేల్స్ ఆఫ్ పే ఎండ్ బై ఫాలోయింగ్ సచ్ ప్రొసిడ్యూర్ ఏజ్ మే బి ప్రిస్కై ్బడ్ బై ది గవర్నమెంట్ బై టైం టూ టైం.
వాస్తవానికి ఇది జరగడం లేదు. అరాకొరా శాలరీస్‌తో వారిని ఎంగేజ్ చేసుకోవడం, గ్రాంట్ ఇన్ ఎయిడ్ అడిగినా తర్వాత మీకే ఇస్తామని చెప్పడం ఇలా అనెధికల్ వే ఆఫ్ ఎంగేజింగ్ ది స్టాప్ జరుగుతూనే ఉంది. ఇక్కడ ఉపాధ్యాయుల స్ధితిగతులను మెరుగుపర్చుతాం అని మేం మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. అందులో భాగంగానూ నవరత్నాల్లోనే భాగంగా,∙విద్యా నవరత్నాల్లో మేం ఉపాధ్యాయుల స్ధితిగతులను అనే ఐటెం పెట్టుకుని, మొత్తం ఉపాధ్యాయ కమ్యూనిటీకి దీన్ని ఎక్స్‌టెండ్ చేస్తున్నాం. డిగ్రీ కాలేజీ కానీయండి, జూనియర్ కాలేజీ కానీయండి, హైస్కూల్ కానీయండి అందరూ ఉపాధ్యాయుల స్ధితిగతులను ఈ రోజు ఒక కామన్ రిడ్రెసల్ ఏజెన్సీ ఒక దాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ స్కూల్ ఎడ్యుకేషన్, రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ హయ్యర్ ఎడ్యుకేషన్
ఈ రెండు ఒక కమిషన్స్, దే ఆర్ ఎస్టాబ్లిష్డ్ బై యాన్ యాక్ట్ ఆప్ ది లెజిస్లేచర్.
దీని పరిధిలోనికి ఇవన్నీ తీసుకురావడం జరిగింది. గత ప్రభుత్వాలెవరైనా కూడా డిఫరెంట్, డిఫరెంట్ నామిక్‌లేచర్స్ అంటే గెస్ట్ లెక్చరర్స్, పార్ట్ టైం లెక్చరర్స్, కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఇలా రక,రకాల పేర్లతో ఎంగేజ్ చేసుకోవడం జరిగింది. వారందరినీ రెగ్యులరైజ్ చేయాలి, ఇరవై సంవత్సరాలు, ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు కాబట్టి వారి స్ధితిగతులను, వారి జీవనప్రమాణాలను ఏ విధంగా మెరుగుపర్చడమనేది ప్రభుత్వం ఒక సోషల్ రెస్పాన్స్‌బులిటీగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికోసం ముఖ్యమంత్రి గారు ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తో కమిటీ వేశారు. కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ రెగ్యులరైజ్ చేయడాని కోసం ఏర్పాటు చేశాం. దాని పరిధిలోకి ఎంతవరకు అవకాశం ఉందో అంతవరకు దాన్ని పరిశీలిస్తాం.
ఇక ఎయిడెడ్ ఇనిస్టిట్యూషన్స్‌లో చాలా కాలంగా భర్తీ చేయకుండా మిగిలిన ఖాలీ పోస్టులున్నాయి. ఎయిడెడ్æ స్కూళ్లలో కూడా ప్రమోషన్స్ ఇచ్చినప్పుడు లోవర్ గ్రేడ్ నుంచి అప్‌గ్రేడ్‌కు పోయినప్పుడు ఆ లోవర్ గ్రేడ్ పోస్టులను భర్తీ చేయకుండా వదిలేశారు. స్కూళ్లలో ఈ ఖాలీలు ఎక్కువగా ఉన్నాయి. వీటి ప్రభావం ఉపాధ్యాయ–విద్యార్ధుల నిష్పత్పిపై పడింది. ఈ నిష్పత్తి తగ్గిపోవడం వల్ల విద్యలో నాణ్యతా ప్రమాణాలు కూడా తగ్గిపోతున్నాయి. దీనికి సంబంధించిన దస్త్రం మా వద్దకు వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారి పరిశీలనలో ఉందది. అన్ని రకమైన విద్యా సంస్ధల్లోనూ నాణ్యతా ప్రమాణాలు తగ్గిన మాట వాస్తవమే. అందుకే నాణ్యతా ప్రమాణాలు పెంచాలని, ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. మేనిపెస్టోలో కూడా చెప్పాం. ఇవన్నీ కచ్చితంగా చేస్తాం. మేనేజిమెంట్ ఇర్రెగ్యులర్ ఫంక్షన్ వలన ఎయిడెడ్ స్కూళ్లపై చాలా ఫిర్యాదులు వచ్చాయి. ఉదాహరణకు నెల్లూరులో ఒకటి శ్రీకాళహస్తిలో ఇంజనీరింగ్ కళాశాలపై ఫిర్యాదులు వచ్చాయి. అలాగే రాజమండ్రి కూడా, ఇలా ఎక్కడైతే ఫిర్యాదులు వచ్చాయో వాటి మీద విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటారు. అలాగే రాజమండ్రి ఎయిడెడ్ స్కూళ్లలో ఆక్రమణలపై ఆర్జేడీ స్ధాయిలో అధికారులతో విచారణ జరిపించి నివేదక తెప్పించుకుని తగిన చర్యలు తీసుకుంటాం.