ఏం చేస్తారో అని భయమేస్తుంది : కాల్వ శ్రీనివాసులు
అమరావతి : రాజధానిని మూడు ముక్కలు చేయడమనేది అనాలోచిత చర్య అని టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. ప్రశాంతంగా ఉండే విశాఖను వైసీపీ నేతలు ఏం చేస్తారో అని భయమేస్తోందని వ్యాఖ్యానించారు. ఏపీకి మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన ఆయన.. జీఎన్. రావు కమిటీ పేరుతో ప్రజల్లో గందరగోళం సృష్టించారని మండిపడ్డారు. గతంలో విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటుకు జగన్ అంగీకరించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. విశాఖలో పాలనా రాజధానిని ఏర్పాటు చేయాలని ఎవరడిగారని ప్రశ్నించారు. రాయలసీమకు రాజధానిని దూరం చేసే దురుద్దేశం జగన్‌లో కనిపిస్తుందన్నారు. హైకోర్టును విశాఖలో పెట్టి.. పాలనా రాజధానిని కర్నూలులో పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కాల్వ డిమాండ్ చేశారు.
ఏం చేస్తారో అని భయమేస్తుంది : కాల్వ శ్రీనివాసులు