అమరావతిలో ఉద్రిక్తత
అమరావతి: రాజధానిపై జీఎన్‌రావు కమిటీ నివేదిక సమర్పించిన నేపథ్యంలో అమరావతిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సచివాలయం-మందడం వై జంక్షన్ వద్ద రాజధాని రైతులు ధర్నా చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి జీఎన్‌రావు కమిటీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రహదారికి అడ్డంగా జేసీబీ పెట్టి...ధర్నా చేయడంతో రాకపోకలు స్తంభించాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సచివాలయం నుంచి జీఎన్ రావు కమిటీని వేరొక మార్గంలో పంపించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. జీఎన్ రావు కమిటీ ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదని రైతులు ఆరోపించారు. రైతులకు తీవ్ర ఆన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో వరద ముంపు వస్తుందని చెబితే.. విశాఖలో పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
అమరావతిలో ఉద్రిక్తత