ఎర్ర తివాచి వద్దు ... నేను మీలో ఒకడినే ... :గవర్నర్

ఎర్ర తివాచి వద్దు ... నేను మీలో ఒకడినే ...


అమరావతి జనవరి 7:


ఆడంబరాలకు దూరంగా ఉండే రాష్ట్ర ప్రధమ పౌరుడు మరో అరుదైన నిర్ణయం తీసుకున్నారు. ప్రోటోకాల్ పేరిట సాగే ఎర్ర తివాచి స్వాగతాలు ఇక వద్దంటున్నారు. రాష్ట్ర రాజ్యాంగ పరిరక్షకుడి హోదాలో గవర్నర్ కు అత్యున్నత స్ధాయి గౌరవ మర్యాదలు అందుబాటులో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ ఇకపై ఈ మర్యాదలు ఏవీ వద్దంటున్నారు. వాయి శకటం నుండి ఎర్రతివాచీతో గవర్నర్ ను స్వాగతించే విధానం రద్దుకు తగిన ఆదేశాలు జారీ చేయాలని బిశ్వ భూషణ్ తన కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాను ఆదేశించారు. ఇటీవల శ్రీశైలం పర్యటనకు వెళ్లినప్పుడు ఈ తరహా ఆలోచనకు అంకురార్పణ చేసిన గవర్నర్ దానిని ఆచరణలోకి తీసుకు రావాలని నిర్ణయించారు. అనవసరపు వ్యయంతో కూడిన బ్రిటీష్ కాలం నాటి సాంప్రదాయాలను విడనాడాలని పేర్కొన్నారు. రాజ్యాంగ బద్దమైన కార్యక్రమాలను మాత్రం ప్రోటోకాల్ ప్రకారం నిర్వహిస్తే సరిపోతుందని, గవర్నర్ ప్రతి పర్యటనకు ఎర్రతివాచీలు అవసరం లేదని ఆయన భావిస్తున్నారు. గవర్నర్ గా ప్రమాణా స్వీకారం తొలిరోజునే ‘హిస్ ఎక్సలెన్సీ’ పేరిట సాగే ప్రత్యేక ప్రస్ధావనను కాదనుకున్నారు, అధికారులకు అదే చెప్పారు, మీడియా ద్వారా “ఆయన శ్రేష్ఠత”  పేరిట సంబోధన వద్దని ప్రజలకు  సైతం విజ్ఞప్తి చేయటం ఆయన గొప్పతనానికి నిదర్శనం.
సాధారణంగా నేతలు పొదుపుపై ప్రసంగాలు చేస్తారే తప్ప ఆచరణలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తారు. కాని గవర్నర్ హరిచందన్ తనదైన శైలిలో వ్యవహరిస్తూ తనకు తానుగా స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు. తన పర్యటనలు హంగు, అర్బాటాలకు దూరంగా సాగాలని తన సిబ్బందికి స్పష్టం చేసిన ప్రధమ పౌరుడు సగటు ప్రజల కోసం ఏమి చెయ్య గలమన్న దానిపైనే ఎక్కువగా దృష్టి సారిస్తూ ఉంటారు. రాజ్ భవన్ గౌరవ మర్యాదలు కాపాడే క్రమంలో కొంత మేర ప్రోటోకాల్ తప్పదంటూ అధికారులు అనుక్షణం ఆయనకు నచ్చచెప్పుకోవలసి వస్తుందంటే హరిచందన్ పనితీరు మనకు ఇట్టే అర్ధం అవుతోంది.  ప్రతి చిన్న విషయంలోనూ పొదుపు చర్యలను అభిలషించే హరిచందన్ తన గౌరవార్ధం వివిధ సందర్భాలలో ప్రముఖులు అందించే శాలువాలను సైతం ఏలా సద్వినియోగం చేయగలమన్న దానిపై సమాలోచిస్తున్నారు. ఇప్పటికే  తనను కలిసేందుకు వచ్చే వారి నుండి పుష్ప గుచ్ఛం స్వీకరించే విధానాలకు స్వస్తి పలికిన మాననీయ గవర్నర్, తనకోసం వచ్చే ఎవరైన మొక్కలను మాత్రమే తీసుకురావాలని నిర్ధేశించారు.
 ఇలా వస్తున్న మొక్కలను తిరిగి రాజ్ భవన్ ప్రాంగణంలో నాటుతూ పర్యావరణ పరిరక్షణ కోసం పరితపిస్తున్నారు. ప్రధమ పౌరునిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి సగటు ప్రజలతో మమేకం అయ్యేందుకే ఇష్టపడే హరిచందన్ తదనుగుణంగానే వ్యవహరిస్తున్నారు. గిరిజన ప్రాంతాలపై పరిపాలకుడి హోదాలో ప్రత్యేక అధికారాలు కలిగిన గవర్నర్ వాటిని సద్వినియోగ పరచటం ద్వారా వారికేదైనా మేలు చేయగలమా అన్నదానిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. గతంలో విజయనగరం జిల్లా సాలూరు అదివాసిలతో భేటీ అయినా, ఇటీవల శ్రీశైలం చెంచులతో సంభాషించినా  వారి కోసం ఏదో చేయాలన్న తలంపే.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image