మార్కెట్‌ యార్డ్‌లకు పూర్వ వైభవం తెస్తాం

‘మార్కెట్‌ యార్డ్‌లకు పూర్వ వైభవం తెస్తాం’
గుంటూరు: రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మం​త్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. గుంటూరు మిర్చి యార్డు చైర్మన్‌గా చంద్రగిరి ఏసురత్నం ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆయన ఆదివారం పాల్గొన్నారు.  ఈ సందర్భంగా  మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ.. ధరల స్థిరీకరణనిధి ఏర్పాటు చేసి.. రైతులను ఆదుకున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిది అని తెలిపారు. మార్కెటింగ్ యార్డ్‌లకు పూర్వ వైభవం తెస్తామని మోపిదేవి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నేడు మంచి రోజులు వచ్చాయని అన్నారు. అందరికీ చైర్మన్ పదవులు దక్కే అవకాశం కలిగిందని ఆమె పేర్కొన్నారు. మిర్చికి రికార్డుస్థాయిలో ధర దక్కుతోందని ఆమె గుర్తు చేశారు. క్వింటా రూ. 21వేలు పలకడం జగన్ పుణ్యమే అని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు.
మంత్రి  శ్రీరంగనాధ్ రాజు మాట్లాడుతూ.. గతంలో అగ్రవర్ణాలకే మార్కెటింగ్ పదవులు దక్కేవి అని అన్నారు. జగన్ చేసిన బీసీ డిక్లరేషన్‌లో భాగంగా అన్ని వర్గాలకి ఇప్పుడు న్యాయం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకం అని 
శ్రీరంగనాధ్ రాజు అన్నారు.


Popular posts
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు
ఎస్కేప్ చానల్ నుండి రెండో పంటకు నీళ్ళు విడుదల చేసిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
Image
నెల్లూరు నగరములో చోరీ::వృద్దురాలిపై దాడిచేసి బంగారు నగలు అపహరణ.
Image