మూడు రాజధానులపై విష్ణుకుమార్ తాజా వ్యాఖ్యలివీ
విశాఖపట్నం : నవ్యాంధ్రకు మూడు రాజధానుల వ్యవహారంపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తాజాగా మరోసారి స్పందించారు. ఆదివారం నాడు విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన అమరావతి రైతులకు అన్యాయం జరగకూడదన్నారు. రాజధానిలో రైతులు బాధపడుతుంటే ఇక్కడ మేము ఎలా ఆనందంగా వుండగలం? అని ఆయన వ్యాఖ్యానించారు.
అణచివేత సరికాదు : 'రైతులను ఆందోళనకు గురి చేయడం తగదు. మూడు రాజధానులు అన్న ఆలోచనే సరికాదు. హైకోర్టు వున్న ప్రదేశం రాజధాని ఎలా అవుతుందో నాకు అర్ధం కావడంలేదు?. రైతుల పట్ల పోలీసుల అణచివేత దోరణి సరికాదు' అని విష్ణుకుమార్ చెప్పుకొచ్చారు.
మూడు రాజధానులపై విష్ణుకుమార్ తాజా వ్యాఖ్యలివీ