*అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు*- *డమ్మీ కాన్వాయి వాడుతున్న మొదటి ముఖ్యమంత్రి జగన్*- *చేజర్ల*
*అమరావతి రాజదాని రైతుల బస్సు యాత్ర ను ప్రారంభించడానికి వెళుతున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో సహా జె ఏ సి నాయకులను అరెస్టు చేయడము దారుణమని జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి శ్రీ చేజర్ల వెంకటేశ్వర రెడ్డి అన్నారు.నాయకుల అక్రమ అరెస్టులకు నిరసనగా కోవూరు అంబెడ్కర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమము నిర్వహించడము జరిగినది.ఈ సందర్భంగా శ్రీ చేజర్ల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ అమరావతి రాజధానులు రైతులు అన్ని అనుమతులు తీసుకొని బస్సు యాత్ర కు బయలుదేరే సమయములో పోలీసులు బస్సు యాత్ర ను అడ్డుకోవడముతో పాటు,ఆ యాత్రను ప్రారంభించడానికి వెళుతున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు అఖిలపక్ష నాయకులను అరెస్టు చేయడము అన్యాయం అని,ముఖ్యమంత్రి శ్రీ వై యెస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను అడ్డుపెట్టుకుని ఉద్యమాన్ని అనగతొక్కలని చూస్తున్నారని,మంత్రులు,అధికారపక్షం శాసనసభ సభ్యులు ఉద్యమకారులను,రైతులను అవమానించెవిధముగా మాట్లాడుతున్నారని,ప్రజాస్వామ్యములో భావ ప్రకటన స్వేచ్ఛ ప్రతిఒక్కరికి ఉందని, ఎవరైనా నిరసనలు తెలుపుకోవచ్చని చెప్పిన డి జి పి గారు ఈరోజు రైతులు చేస్తున్న ఉద్యమాన్ని అణిచివేయడానికి ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారో చెప్పాలని, డి జి పి గారు అధికారపార్టీకి ఒక చట్టము, ప్రతిపక్ష పార్టీలకు ఒక చట్టము ఉందేమో చెప్పాలని,అమరావతి ని రాజధానిగా కొనసాగించాలని రైతులు, ప్రజలు చేస్తున్న ఉద్యమానికి బయపడి రాష్ట్ర చరిత్రలో గతములో ఏ ముఖ్యమంత్రి చేయనివిధంగా డమ్మీ కాన్వాయిని ముందు పంపి వెనుక మరొక కాన్వాయిలో పోవడముతో పాటు,ఆయన వెళ్లే మార్గములో ప్రతి ఇంటి ముందు నెట్ ఏర్పాటు చేసి ప్రతి ఇంటిముంది పోలీసులను కాపలా పెట్టుకొని సచివాలయంకు వెళుతున్నారని,నేను సోనియాగాంధీ నే ఎదిరించానని చెప్పుకునే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పోలీసు పహరలో వెళుతున్నాడని,ఈయన సీమ పౌరసం ఏమైనదని,ఇప్పటికయినా ముఖ్యమంత్రి గారు ప్రజలలో వస్తున్న ఉద్యమాన్ని సూచి అయినా మూడు రాజధానులు ప్రతిపాదన విరమించుకొని అమరావతి ని రాజధానిగా కొనసాగించాలను డిమాండ్ చేసారు, ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ ఏలూరు కృష్ణయ్య, శ్రీ దారా విజయబాబు, శ్రీ పెనుమల్లి శ్రీహరిరెడ్డి,శ్రీ గునుపాటి రవీంద్రరెడ్డి, శ్రీ కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, శ్రీ ఒబ్బారెడ్డి మల్లిఖార్జున రెడ్డి, శ్రీ మారం వెంకటేశ్వర్లు,శ్రీ బుధవరపు శివకుమార్, శ్రీ ఇందుపురు మురళీ కృష్ణా రెడ్డి,శ్రీ సాయి రోశయ్య, శ్రీ మన్నెపల్లి నాగేంద్ర, శ్రీ వీతంశెట్టి మధుసూధన రావు,శ్రీ ఓంకార్,శ్రీ పులా వెంకటేశ్వర్లు,శ్రీ పాలూరు వెంకటేశ్వర్లు,శ్రీ అగ్గి మురళి,నజీర్,గయాజ్,శ్రీ ఆదిశేషయ్య, శ్రీ సురేష్,ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు*