రేపు సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు
రేపు విజయవాడలో సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నయ్య కుమార్‌లతో సహా వివిధ రాష్ట్రాల నేతలు పాల్గొంటారు. రేపు సాయంత్రం లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో విజయవాడ సింగ్ నగర్ ఎంబీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించనున్నట్టు రామకృష్ణ తెలిపారు.
రేపు సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు