మండలి రద్దైతే మంత్రి పదవికి రాజీనామా
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు తీర్మానాన్ని కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే. కాగా ఆ తీర్మానం ఆమోదం పొంది మండలిని రద్దు చేస్తున్నట్టు సమాచారం వస్తే వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. మండలి రద్దుపై కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందన్నారు. మండలి రద్దును అడ్డుకునేందుకు చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని, అయితే మూడు ప్రాంతాల అభివృద్ధి కోసమే మూడు రాజధానులన్నారు. తమ ల్యాండ్ బ్యాంక్‌కు నష్టం జరుగుతుందనే చంద్రబాబు మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు కనుసన్నల్లో మండలిని ఎలా నడిపిస్తారని ప్రశ్నించారు.
మండలి రద్దైతే మంత్రి పదవికి రాజీనామా