రాజధానిని అమరావతి నుంచి విశాఖపట్నానికి

రాజధానిని అమరావతి నుంచి విశాఖపట్నానికి తరలించడానికి అధికార వైకాపా ప్రభుత్వం శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. మంగళవారం నాడు క్యాబినెట్‌ సబ్‌కమిటీ సమావేశం తరువాత బుధవారం నాడు మంత్రివర్గసమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో రాజధాని తరలింపుపై అధికారిక నిర్ణయాన్ని తీసుకుని...శాఖల తరలింపు గురించి చర్చిస్తారని సమాచారం. ఇప్పటికే పలు శాఖాధిపతులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో రాజధాని తరలింపుపై అధికారికంగా చెప్పబోతున్నారు. దీంతో రాజధాని తరలింపు జనవరి రెండో వారం నుంచే మొదలు కానుంది. 


ఒకవైపు రాజధానిని ఇక్కడే కొనసాగించాలని రాజధాని ప్రాంతంలోని రైతులు భారీ స్థాయిలో ఉద్యమిస్తుంటే...వారి ఉద్యమాన్ని పట్టించుకోకుండానే ప్రభుత్వం తాము చేయాలనుక్ను పనులను వరుసగా చేసుకుంటూపోతోంది. రాజధాని రైతుల ఆందోళన పతాకస్థాయికి చేరినా, వారి ఉద్యమానికి అన్ని వైపుల నుంచి మద్దతు వస్తున్నా...ప్రభుత్వం మాత్రం దాన్ని గుర్తించడం లేదు. అది ఫెక్‌ ఉద్యమమని చెబుతూ కొంతమంది రియల్‌ఎస్టేట్‌ బ్రోకర్లు ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారని మంత్రులు,ఎమ్మెల్యేలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. రాజధానిని ఇక్కడే కొనసాగించాలని టిడిపి,బిజెపి,జనసేన, సిపిఐ,సిపిఎం తదితర పార్టీలు చెబుతున్నా..ప్రభుత్వం మాత్రం వారి మాటలను కనీసం పరిగణలోకి తీసుకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా రాజధాని తరలింపుపై ప్రజల్లో అసహనం, ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా రాయలసీమ వాసులు..విశాఖలో రాజధానిని ఏర్పాటు చేస్తే...తమకు చాలా దూరం అవుతుందని, ఉంటే రాజధానిని 'అమరావతి'లో కొనసాగించాలని, లేకుంటే రాయలసీమలో పెట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే వారి డిమాండ్‌ను కానీ, ఇతర ప్రాంతాలవారి డిమాండ్‌ను కానీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకుండా, తరలింపుకు న్యాయపరమైన అడ్డంకులు రాకుండా చర్యలు తీసుకుంటూ తాను తీసుకున్ననిర్ణయాన్ని అమలు చేయబోతోంది.


ఈ నేపథ్యంలో ముందుగా 32శాఖలను విశాఖపట్నం తరలించాలని ప్రయత్నాలు చేస్తోంది. సచివాలయంలోని జిఎడిని ముందుగా తరలిస్తారని వార్తలు వస్తున్నాయి. దానితోపాటు విద్యాశాఖను కూడా తరలిస్తారంటున్నారు. ఇక హోం, ఆర్థికశాఖలతో పాటు ఇతర ముఖ్యమైన శాఖలను జనవరి ఆఖరి లోపే విశాఖపట్నానికి తరలిస్తారని, ఫిబ్రవరి, మార్చి నాటికి తరలింపు పూర్తి అవుతుందంటున్నారు. ఆగమేఘాలపై రాజధాని తరలించడంపై సచివాలయ ఉద్యోగులు కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు విశాఖపట్నం వెళ్లడం ఎలా వీలవుతుందని అంతర్గతంగా ప్రశ్నించుకుంటున్నారు. కానీ..ఏఒక్కరు కూడా రాజధాని తరలింపుపై కనీస నిరసన వ్యక్తం చేయడానికి ముందుకు రావడం లేదు. ఎవరికి వారు భయంతో..తమకెందుకులే..అందరూ ఎలా అయితే తాము అలా అంటూ మౌనంగా బాధను వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద తాను అనుకున్నట్లే 'జగన్‌' రాజధాని జనవరిలోనే విశాఖకు తరలిస్తారనే దానిపై  అటు ప్రభుత్వ వర్గాల్లోనూ, ఇటు ప్రజల్లోనూ స్పష్టత తెస్తున్నారు. 


Popular posts
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు
ఎస్కేప్ చానల్ నుండి రెండో పంటకు నీళ్ళు విడుదల చేసిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
Image
నెల్లూరు నగరములో చోరీ::వృద్దురాలిపై దాడిచేసి బంగారు నగలు అపహరణ.
Image