ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కమిషన్ల ఏర్పాటుపై సభలో ముఖ్యమంత్రి

*21.01.2020*
*శాసనసభ*


*అమరావతి:


ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కమిషన్ల ఏర్పాటుపై సభలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి*


*ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కమిషన్లు చరిత్రాత్మక నిర్ణయం*
*అయినా బిల్లును శాసన మండలిలో టీడీపీ అడ్డుకుంది*
*ఇదీ చంద్రబాబు, ఆ పార్టీ ఎమ్మెల్యేల దిక్కుమాలిన వైఖరి*
*అందుకే మరోసారి శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టాం*
*సభలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 
ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, అభివృద్ధే మా ప్రభుత్వ ధ్యేయం*
*మంత్రుల్లో ఆరుగురు ఆ వర్గాలకు చెందిన వారే*
*అయిదుగురు ఉప ముఖ్యమంత్రుల్లో ఇద్దరు వారే*
*దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీలకు 3 కార్పొరేషన్లు*
*ఇదీ ఆ వర్గాల వారిపై మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి* 
*ఎస్సీలను విభజించి లబ్ధి పొందాలని చంద్రబాబు చూశారు*
*శాసనసభలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌* 


 ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేయాలన్నది ఒక చరిత్రాత్మక నిర్ణయమని, కానీ ఆ బిల్లును శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ అడ్డుకుందని, ఇది విపక్షనేత చంద్రబాబుతో పాటు, ఆ పార్టీ ఎమ్మెల్యేల దిక్కుమాలిన వైఖరి అని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. అందుకే సభలో మంగళవారం మరోసారి ఆ బిల్లును ప్రవేశపెట్టామని ఆయన వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, అభివృద్ధి తమ ధ్యేయమని, అందుకే మంత్రి పదవుల్లో ఆరుగురిని నియమించామని, అయిదుగురు ఉప ముఖ్యమంత్రులలో ఇద్దరు ఆ వర్గాలకు చెందిన వారున్నారని తెలిపారు. అంతే కాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీలకు మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. కానీ చంద్రబాబు మాత్రం జనాభాలో దాదాపు 18 శాతం ఉన్న ఎస్సీలను విడదీసి లబ్ధి పొందాలని చూశారని సీఎం ఆక్షేపించారు. 
 ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్ల ఏర్పాటుకు సంబంధించిన బిల్లును ప్రభుత్వం మరోసారి సభలో ప్రవేశపెట్టింది. దీనిపై పలువురు సభ్యుల మాట్లాడిన అనంతరం, సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. 


*టీడీపిది దిక్కుమాలిన చరిత్ర*
 ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేసే చరిత్రాత్మక బిల్లును గతంలో శాసన మండలిలో ఆమోదం పొందకుండా చేసిన దిక్కుమాలిన చరిత్ర తెలుగు దేశం పార్టీది అని, ఇదీ ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు, పార్టీ ఎమ్మెల్యేల వైఖరి అని సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. దీంతో మరోసారి శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టామని, ఈసారి మండలిలో అడ్డుకోవడం సాధ్యం కాదు కాబట్టి, సభలో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. ఆ విధంగా కనీస ఇంగిత జ్ఞానం లేకుండా విపక్షం వ్యవహరిస్తోందని తెలిపారు.


*మూడు కార్పొరేషన్లు* 
 రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎస్సీలకు మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ వెల్లడించారు. మాల, మాదిగతో పాటు, రెల్లి ఇతర కులాలకు వేర్వేరుగా మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. కానీ అదే ఎస్సీలను విడదీసి రాజకీయ ప్రయోజనం పొందేందుకు చంద్రబాబు కుట్ర చేశారని, వారిని విభజించి పాలించాలని దుర్భుధ్ధితో వ్యవహరించారని ఆక్షేపించారు. దాదాపు 18 శాతం ఉన్న ఎస్సీలు కలిసి ఉంటే, వారి డిమాండ్‌కు తలొగ్గాల్సి వస్తుందన్న దుర్భుద్ధితో వారిని విడగొట్టాలని చంద్రబాబు అడుగులు వేశారని పేర్కొన్నారు. దాన్ని సరిచేస్తూ, ఎస్సీలంతా ఒక్కటై ఉండాలన్న లక్ష్యంతో మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని చెప్పారు.


*మరింత మేలు చేసేలా*..
 అదే విధంగా ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేంగా వేర్వేరు కమిషన్లు ఏర్పాటు చేసి వారి జీవితాలు బాగు చేయాలని ప్రయత్నిస్తున్నామని సీఎం వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలను ప్రస్తావించిన ఆయన, వాటిలో రెండు మినహా అన్నింటినీ వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గెల్చుకుందని గుర్తు చేశారు. టీడీపీ నుంచి ఒకరు, జనసేన నుంచి మరొకరు గెల్చారని తెలిపారు. కాగా, జనసేన నుంచి గెల్చిన ఎమ్మెల్యే, తాము చేస్తున్న మంచి పనులు చూసి మద్దతు ఇస్తున్నారని తెలిపారు. 
 ఇక తమకు ఉన్న ఏకైక సభ్యుడిని ముందు పెడుతున్న టీడీపీ, రాజకీయం చేస్తోందని, ఆయన వైఖరి చూస్తుంటే, ఎందుకు గెలిపించామని ఆ నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారని సీఎం పేర్కొన్నారు.


*ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్య పోస్టులు*
 గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎస్సీ, ఎస్టీలకు 6 మంత్రి పదవులు ఇచ్చామన్న సీఎం శ్రీ వైయస్‌ జగన్, వారిలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు కూడా ఉన్నారని చెప్పారు. ఇంకా కీలకమైన విద్యా మంత్రి, హోం మంత్రి కూడా ఎస్సీలని, దీన్ని గర్వంగా చెప్పగలమని అన్నారు. ఇదే కాకుండా ఎక్సైజ్‌ మంత్రి నారాయణస్వామి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారని తెలిపారు. ఆ విధంగా ఎస్సీలను ముఖ్యమైన పదవుల్లో నియమించామని వివరించారు.


*ఇప్పుడైనా మద్దతు ఇవ్వండి*
 వీటన్నింటితో పాటు, ఎస్సీ, ఎస్టీలకు ఇంకా మేలు చేయడం కోసం వేర్వేరు కమిషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తే, గతంలో ఆ బిల్లును మండలిలో టీడీపీ అడ్డుకుందని, కాబట్టి శాసనసభలో మళ్లీ బిల్లును ప్రవేశపెట్టామని సీఎం తెలిపారు. ఇది ఒక చరిత్రాత్మక నిర్ణయం కాబట్టి అందరూ మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు