ఐదు కోట్ల ప్రజల మనోభావాలతో చాలా చులకనగా ఆడుకుంటున్నారు..

🔸నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ నేతల సమావేశం..


*మాజీ మంత్రి సోమిరెడ్డి కామెంట్స్*


🔸జీఎన్ రావు, బీసీజీ....ఏ కమిటీ అయినప్పటికీ అసెంబ్లీలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారో అదే నివేదికల్లో కనిపిస్తోంది..


🔸వైజాగ్ లో విజయసాయి రెడ్డి ఏమని ప్రకటించారో దానినే నివేదికల్లో రాస్తున్నారు...వారిద్దరు చెప్పిందే జరుగుతోంది..


🔸బీసీజీ వారం రోజుల్లోనే నివేదిక ఇచ్చింది..జీఎన్ రావు కమిటీ రిపోర్టును జెరాక్స్ తీసిచ్చినట్టుంది..


🔸ఐదు కోట్ల ప్రజల మనోభావాలతో చాలా చులకనగా ఆడుకుంటున్నారు..


🔸ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిస్థితి దురదృష్టకరం..151 సీట్లతో గెలిపిస్తే ప్రజలకు పాలన అందించడం మానేసి రాష్ట్రంలో కన్ఫ్యూజన్ వాతావరణం తెచ్చారు..


🔸జీఎన్ రావు కమిటీ గవర్నర్ నివాసం అమరావతిలో అని చెప్పింది..బీసీజీ రిపోర్టు మాత్రం వైజాగ్ కు మార్చినట్టుంది..


🔸మంత్రుల నివాసాలు అమరావతిలో అని జీఎన్ రావు కమిటీ చెప్పగా బీసీజీ అసలేం చెప్పలేదు..మంత్రులు గాలిలో ఉంటారా..


🔸ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజలెనుకున్న ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రం ఆమోదించి, రాజధానికి నిధులు విడుదల చేసి, దేశ చిత్రపటంలో రాజధానిగా అమరావతిని గుర్తించి ఈ రోజు మారస్తామంటే ఆషామాషి కాదు..అది మీ వల్ల కాదు.


🔸మీ ఐదేళ్ల పాలన కాలంలో హైకోర్టు మూడు బెంచీలకు సుప్రీకోర్టు అనుమతులు వచ్చేది కష్టమే..హైకోర్టు మార్చడం అంత తేలికకాదు..


🔸సాక్ష్యాత్తు ప్రధాని మోదీ శంకుస్థాపన చేసి, నిధులిచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోబోదు..


🔸ప్రజల హక్కులను కాపాడేందుకు న్యాయ స్థానాలున్నాయి..


🔸ఇప్పటికైనా కక్షసాధింపు చర్యలను ఆపండి..చంద్రబాబు నాయుడిపై కోపంతో రాష్ట్రాన్ని నాశనం చేయకండి..


🔸ప్రశాంతంగా ఆలోచించండి...రైతులను బాధపెడుతుండటం దురదృష్టకరం..ఇది మీ పార్టీకి, ప్రభుత్వానికి, రాష్ట్రానికి మంచిది కాదు..


🔸అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ను ఆర్నెళ్లలో అధోగతి పట్టించారు..


Popular posts
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు
ఎస్కేప్ చానల్ నుండి రెండో పంటకు నీళ్ళు విడుదల చేసిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
Image
నెల్లూరు నగరములో చోరీ::వృద్దురాలిపై దాడిచేసి బంగారు నగలు అపహరణ.
Image