రాష్ట్రం పాలిట కాలకేయుడిలా మారిన జగన్‌.

తేది. 18-01-2020.


విలేకరుల సమావేశం వివరాలు.....


రాష్ట్రం పాలిట కాలకేయుడిలా మారిన జగన్‌.


 - తన దోపిడీచర్యలనుంచి ప్రజలదృష్టిని మళ్లించడానికే ముఖ్యమంత్రి రాజధానిపై పడ్డాడు.


- అబద్ధం, మోసం, అవినీతి అనేసాధనాలతో జగన్‌ పాలనచేస్తున్నాడు.


- మద్యం, ఇసుక ధరల పెంపువల్ల వచ్చే సొమ్ము ఎవరిజేబుల్లోకి వెళుతోంది.


- ఎవరికిమేలు చేయడానికి, మద్యం దుకాణాల్లో 5రకాల బ్రాండ్లే అమ్మాలని చెప్పారు.


- మద్యం సరఫరా చేస్తున్న డిస్టిలరీ కంపెనీలకు, జగన్‌కు ఉన్న సంబంధమేంటి?


- జగన్‌ కేంద్రహోంమంత్రిని తన ప్రయోజనాలకోసం కలుస్తున్నాడా..లేక ప్రజలకోసమా?  


                              - శ్రీ వర్ల రామయ్య (పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు)      


ముఖ్యమంత్రి అసమర్థ, అవినీతిపాలన వల్ల ప్రజలు ఇబ్బందులుపడుతున్నారని, ఆయన తన నిర్ణయాలతో రాష్ట్రంపాలిట కాలకేయుడిలా తయారయ్యాడని, పచ్చగా ఉన్న సంసారంలో చిచ్చుపెట్టినట్లుగా, ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ఆరనిజ్వాలలు రేపాడని టీడీపీ సీనియర్‌నేత, ఆపార్టీ పొలిట్‌బ్యూరోసభ్యులు వర్ల రామయ్య మండిపడ్డా రు. శనివారం ఆయన ఆత్మకూరులోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, జగన్‌, ఆయన అనుచరులు, తాబేదారులు కాలకేయుల్లా రాష్ట్రంపై పడ్డారని అభివర్ణించారు. ఇదివరకే రాజధానిగా నిర్ణయమైపోయిన అమరావతిని,  ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్న హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, ఇతరశాఖల ప్రధాన భవనాలను విశాఖకు తరలిస్తామని చెప్పడం కాలకేయులు చేసే పనులుకావా  అని ఆయన ప్రశ్నించారు. వెనుకటికెవరో అయ్యవారు ఏం చేస్తున్నారంటే, చేసిన తప్పులు సరిదిద్దుకుంటున్నారని చెప్పినట్లుగా జగన్‌ నిర్ణయాలు ఉన్నాయన్నారు. టీడీపీ పాలనలో రూ.4,000లకు లభించిన లారీఇసుక, ఇప్పుడు రూ.8వేలు పలుకు తోందని, మిగిలిన రూ.4వేలు ఎవరిజేబుల్లోకి వెళుతున్నాయని వర్ల నిలదీశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యంపాలసీవల్ల రాష్ట్ర ఆదాయం పక్కరాష్ట్రానికి వెళుతోందని, కర్నూలు సరిహద్దుల్లోని గ్రామాలవారంతా, మద్యంకోసం పక్కనున్న మహబూబ్‌నగర్‌లో ని ఆలంపూర్‌కు వెళుతున్నారన్నారు. ఆలంపూర్‌లో మద్యం ధరకు, కర్నూలులో మద్యం ధరకు రూ.40, రూ.50వ్యత్యాసం ఉందని, పెరిగినఛార్జీలు ఎవరిఖాతాల్లోకి వెళుతున్నాయో జగన్మోహన్‌రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యందుకాణాల్లో 5రకాలబ్రాండ్లే అమ్మాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఆయా డిస్టిలరీకంపెనీల యజమానులెవరో, వారిపై జగన్‌కు ఎందుకంతప్రేమో చెప్పాలన్నారు. తాము సూచించిన మద్యంరకాలనే అమ్మాలనే నిర్ణయం ఎందుకు తీసుకున్నారో, దానివల్ల ఎవరికిలాభమో స్పష్టంచేయాలన్నారు. ఇలాంటి తప్పుడు నిర్ణయాలవల్ల, రాష్ట్రాన్ని దోచుకుంటున్న తమనిర్ణయాలనుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే, జగన్‌ రాజధాని నిర్ణయాన్ని తెరపైకి తెచ్చాడని వర్ల దుయ్యబట్టారు.      తన నిర్ణయాలపై జగన్‌ ఆత్మావలోకనం చేసుకోవాల్సిన సమయం వచ్చిందని, 2013లో సుప్రీంకోర్టు డివిజన్‌ బెంచ్‌ తనగురించి ఏంచెప్పిందో ఆయన తెలుసుకోవాలన్నారు.    జగన్‌కు ఇంతసంపాదన ఎలా వచ్చింది.. ఏంచేస్తే వచ్చిందని సుప్రీండివిజన్‌బెంచ్‌ , న్యాయమూర్తులు ఆశ్చర్యపోయినమాట వాస్తవంకాదా అని రామయ్య ప్రశ్నించారు. ఇటీవలే ఢిల్లీహైకోర్టు కూడా చిదంబరం కేసులో జగన్‌ అవినీతిని ప్రస్తావించిందని, అలాంటి వ్యక్తి అవినీతిరహితపాలన అందిస్తానంటే, ప్రజలెలా నమ్ముతారన్నారు. అనంతపురం, చిత్తూరు, తిరుపతి, ప్రాంతాలవాళ్లు మద్యంకోసం సరిహద్దులు దాటే పరిస్థితిని తీసుకొచ్చింది జగన్‌కాదా అని వర్ల నిలదీశారు. రాజధానిప్రాంతంలో 144సెక్షన్‌ పెట్టడంపై హైకోర్టుకూడా ప్రభుత్వతీరుని తప్పుపట్టిందన్నారు. సంఘటనను బట్టి, సెక్షన్‌ 30 కొనసాగించినట్లుగా, సెక్షన్‌144 ఉంచడానికి వీల్లేదన్నారు. అబద్ధాలు, మోసం, అవినీతి అనేసాధనాలతో, పనిచేస్తున్న ప్రభుత్వం ప్రజల్ని ఎలా రక్షిస్తుందన్నారు.  జగన్‌ నైతికవిలువలు పాటించే వ్యక్తే అయితే, చెన్నై ఐఐటీ ఇచ్చినట్లుగా చెబుతూ, తప్పుడు నివేదికను బోస్టన్‌గ్రూప్‌పేరుతో ప్రచారం చేసి ఉండేవారుకాదన్నారు. తమ నాయకుడు ఎలా వ్యవహరిస్తున్నాడో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడో 151   మంది ఎమ్మెల్యేలు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి, మంత్రిబొత్స బోగస్‌గ్రూప్‌ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామంటే, అంతకంటే దుర్మార్గం ఉండబోదన్నారు. బొత్స సత్యనారాయణ నోరుతెరిస్తే అన్నీ అబద్ధాలే వస్తాయన్నారు.  కేంద్రం నియమించిన శివరామకృష్ణన్‌ కమిటీ నివేదిక ఆధారంగానే, గతప్రభుత్వం  రాజధానిగా అమరావతిని నిర్ణయించిందన్నారు. న్యాయస్థానం చెప్పకుంటే, జగన్‌ప్రభు త్వం రైతులనోట్లో మట్టికొట్టి, ఒక్కరోజులోనే రైతులనిర్ణయాలు తీసుకొని, తూతూమంత్ర ంగా ముగించేసేదేనని రామయ్య స్పష్టంచేశారు. సుభిక్షంగా ఉన్న మహిష్మతి లాంటి ఆంధ్రప్రదేశ్‌ను ధ్వంసం చేయడానికి, కాలకేయుల్లా జగన్‌, ఆయనఅనుచరులు ఉవ్విళ్లూ రుతున్నారన్నారు. బోగస్‌కమిటీలను పరిగణనలోకి తీసుకోకుండా, నిష్ణాతులు, నిపుణుల తో కమిటీవేసి, రైతులు, రాష్ట్రప్రజల అభిప్రాయాలు తీసుకున్నాకే, జగన్‌ రాజధానిపై ముందుకెళ్లాలని వర్ల హితవుపలికారు. జగన్‌, కేంద్రహోంమంత్రిని ఎందుకు కలుస్తున్నా రో చెప్పాలన్నారు. జగన్‌ ఢిల్లీ ఎందుకు వెళుతున్నాడో చెప్పాలని, తనకేసులనుంచి బయటపడటంకోసమా..లేక వ్యక్తిగతహజరునుంచి మినహాయింపుకోసం వెళుతున్నా రా.. లేక రాష్ట్రప్రయోజనాలకోసం వెళుతున్నారో చెప్పాలని వర్ల డిమాండ్‌చేశారు. ఇప్పటికైనా జగన్‌ తననిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటే, చరిత్రలో నిలిచిపోతాడన్నారు.          


 
 


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు