వై. యస్. ఆర్. ప్రవాసాంధ్ర సేవా కేంద్రం
రాజంపేట : ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ తన సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా డా. వై ఎస్ ఆర్ కడప జిల్లా రాజంపేట లో “వై. యస్. ఆర్. ప్రవాసాంధ్ర సేవా కేంద్రం” ను ఈ రోజు ఉదయం 10 గంటలకు రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మరియు మైనారిటీ వెల్ఫేర్ శాఖ మాత్యులు శ్రీ అంజద్ బాషా గారు, రైల్వేకోడూరు శాసన సభ్యులు, విప్ శ్రీ శ్రీనివాసులు గారు ,రాజంపేట శాసనసభ్యులు మరియు టీటీడీ బోర్డు మెంబర్ శ్రీ మేడా వెంకట మల్లికార్జున రెడ్డి గారు, రాజంపేట పార్లమెంట్ ఇంచార్జ్,మాజీ శాసన సభ్యులు శ్రీ.ఏ అమర్నాథ్ రెడ్డి గారు, ఏపిఎన్ఆర్ టి సొసైటీ అధ్యక్షులు శ్రీ వెంకట్ ఎస్ మేడపాటి గారు , కడప పార్లమెంట్ ఇంచార్జి మరియు కడప మాజీ మేయర్ శ్రీ కె .సురేష్ బాబు గారు , రాజంపేట డిఎస్పీ శ్రీ నారాయణ స్వామి రెడ్డి గారు మరియు ఆర్ డీ ఓ శ్రీ పి. ధర్మారెడ్డి గారు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గల్ఫ్ వైసీపీ కన్వీనర్లు శ్రీ బి హెచ్ .ఇలియాస్ గారు మరియు శ్రీ ఎం.బాలిరెడ్డి గారు కూడా హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రుల క్షేమమే ధ్యేయంగా వారికి సేవలందించడంలో రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం, శ్రీ వెంకట్ ఎస్ మేడపాటి గారి అధ్యక్షతన ఏపిఎన్‌ఆర్‌టిఎస్ పనిచేస్తోందని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ అంజద్ బాషా గారు అన్నారు. విదేశాలకు వెళ్లే వారికి, అక్కడున్న ప్రవాసాంధ్రులకు ఎన్నో సేవలందిస్తున్న ఏపిఎన్అర్ టి సొసైటీ తన సేవలను మరింత చేరువచేయడానికి ఈ సేవా కేంద్రం ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసారు. రాయలసీమ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండే విధముగా రాజంపేటలో ప్రాంతీయ కార్యాలయమును ఏర్పాటు చేసిన ఏపిఎన్ఆర్ టి సొసైటీ అధ్యక్షులు శ్రీ వెంకట్ ఎస్ మేడపాటి గారిని ఆయన అభినందించి సత్కరించారు.
విదేశాలలో ఉన్న ఆంధ్రులు ఏపిఎన్‌ఆర్‌టిఎస్ సేవలని వినియోగించుకోవాలని ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు శాసన సభ్యులు శ్రీ కె . శ్రీనివాసులు గారు కోరారు. ఈ వై ఎస్ ఆర్ ప్రవాసాంధ్ర సేవా కేంద్రం ప్రారంభోత్సవానికి విచ్చేసిన రాజంపేట శాసనసభ్యులు మరియు టీటీడీ బోర్డు మెంబర్ శ్రీ . మేడా వెంకట మల్లికార్జున రెడ్డి గారు మాట్లాడుతూ ఏపిఎన్‌ఆర్‌టిఎస్ కార్యాలయము తన నియోజక వర్గంలో ప్రారంభించినందుకు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసారు. కడప జిల్లా మరియు పరిసర ప్రాంతాల నుండి ఎంతో మంది విదేశాలకు వెళ్తున్నారని, వారిలో చాలా మంది ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లి, అక్కడ చట్టాల గురించి సరైన అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.. అలా విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వారు సరైన అవగాహనతో, తమ సందేహాలను నివృత్తి చేసుకొని వెళ్ళడానికి ఏపిఎన్‌ఆర్‌టిఎస్ వారి రాజంపేట ఆఫీస్ ఎంతో ఉపయోగ పడుతుందని తెలిపారు. రాజంపేట పార్లమెంట్ ఇంచార్జ్,మాజీ శాసన సభ్యులు శ్రీ.ఏ అమర్నాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ రాజంపేటలో వై ఎస్ ఆర్ ప్రవాసాంధ్ర సేవా కేంద్రం ప్రారంభించటం రాయలసీమ ప్రాంత వాసులకు ఎంతో ఉపయోగకరమని అభిప్రాయపడ్డారు. ఏపిఎన్నార్టీ సొసైటీ అధ్యక్షులు శ్రీ. వెంకట్ ఎస్. మేడపాటి మాట్లాడుతూ 24/7 హెల్ప్ లైన్ ద్వారా 365 రోజులు 24 గంటలు ఏపిఎన్‌ఆర్‌టిఎస్ ప్రవాసాంధ్రులకు అందుబాటులో ఉంటోందన్నారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ప్రధాన కార్యాలయం నుండి కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఏపిఎన్నార్టిఎస్, ప్రవాసాంధ్రులకు అందించే వివిధ సేవలు... విదేశాల్లో మరణించిన ప్రవాసాంధ్రులకు మరియు ఎవరైతే కదలలేని స్థితిలో నిస్సహాయంగా ఉన్నారో అలాంటి వారికి సహాయంగా ఒక సహాయకుడిని ఇచ్చి ఉచిత అంబులెన్స్ సేవ అందించడం, ప్రవాసాంధ్రుల కుటుంబ ఆర్ధిక భద్రతలో భాగంగా ప్రవాసాంధ్ర భరోసా బీమా అందించడం, అభ్యర్థులకు శిక్షణా కార్యక్రమాలు-ఉద్యోగావకాశాలు కల్పించడం, ప్లేస్ మెంట్ డ్రైవ్స్ నిర్వహించడం, దేవాలయాల దర్శనం కల్పించడం, విద్యావాహిని ద్వారా విదేశాల్లో విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు విదేశీ యూనివర్సిటీ ల గురించి తెలియజేయడం తదితర కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు ఈ వై ఎస్ ఆర్ ప్రవాసాంధ్ర సేవా కేంద్రంలో లభిస్తాయని, ప్రధాన కార్యాలయం రాలేని వారికి, రాయలసీమ ప్రాంత వాసులకు ఈ కేంద్రం అందుబాటులో ఉంటుందని సొసైటీ అధ్యక్షులు శ్రీ. వెంకట్ ఎస్. మేడపాటి గారు తెలిపారు. ప్రవాసాంధ్రులకు తమ సేవా కార్యక్రమాలను అందిస్తూ, అందరికి అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసిన ప్రవాసాంధ్ర సేవా కేంద్రం సేవలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కడప పార్లమెంట్ ఇంచార్జి మరియు కడప మాజీ మేయర్ శ్రీ కె .సురేష్ బాబు సూచించారు. రాజంపేట డిఎస్పీ శ్రీ నారాయణ స్వామి రెడ్డి గారు మాట్లాడూతూ విదేశాలకు వెళ్లాలనుకునే వారు ఈ కేంద్రం ని సంప్రదించాలని, సొసైటీ సేవలలో అవసరమైన సహాయ సహకారాన్ని పూర్తి స్థాయిలో అందిస్తామని తెలిపారు . ఆర్ డీ ఓ శ్రీ పి. ధర్మారెడ్డి గారు మాట్లాడుతూ ప్రవాసాంధ్రులు ఎదుర్కొనే సమస్యలకు ఏపిఎన్‌ఆర్‌టిఎస్ అందించే సహకారానికి తోడుగా, మా విభాగం నుండి కావలసిన సహాయం ఎల్లవేళలా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రవాసాంధ్రులు, జిల్లా వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు, ఏపిఎన్‌ఆర్‌టిఎస్ సిబ్బంది హాజరయ్యారు.
వై. యస్. ఆర్. ప్రవాసాంధ్ర సేవా కేంద్రం