జగన్ నిర్ణయంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తిగా ఉన్నారు
విజయవాడ : అమరావతి రాజధాని కోసం కులమతాలకు అతీతంగా పోరాడుతున్నారని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతిలో అన్ని సౌకర్యాలు కల్పిస్తే రాజధానిని మార్చడం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబుపై, ఒక కులం మీద కక్షతో ఇలా చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అమరావతి అనువైన ప్రాంతమని కేశినేని నాని అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఎం జగన్ నిర్ణయంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తిగా ఉన్నారన్నారు. కృష్ణా, గుంటూరు ప్రజాప్రతినిధులు రాజధాని కావాలో లేదో చెప్పాలన్నారు. రాజధానికి ద్రోహం చేసి చరిత్ర హీనులుగా మారవద్దన్నారు. ప్రాణాలైనా అర్పించి రాజధానిని కాపాడుకుంటామని కేశినేని నాని స్పష్టం చేశారు.
జగన్ నిర్ణయంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తిగా ఉన్నారు