*విజయవాడ*
*జనసేన పార్ట్ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ కామెంట్స్...*
అమరావతి పరిరక్షణ సమితి బస్ యాత్రను అడ్డుకున్నారు
చంద్రబాబు నాయుడు తో పాటు పలువురు నేతల
అరెస్ట్ ను జనసేన తరపున ఖండిస్తున్నాం
గతంలో జనసేన చేపట్టిన కార్యక్రమాలకు పోలీసులు అనుమతులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారు
రైతులకు న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ తరపున పోరాడుతాం
జాయింట్ యాక్షన్ కమిటీతో పాటు తమ పార్టీ నేతలు కూడా పాల్గొంటారు
రాబోయే వారం రోజుల కాలంలో చేపట్టబోయే కార్యక్రమాలపై పార్టీ నేతలతో కలిసి చర్చించాం
ఈరోజు సాయంత్రం విజయవాడకు పవన్ కళ్యాణ్ వస్తున్నారు
రైతులకు భరోసా కల్పించాలి
రైతులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకోండి
ప్రజాప్రతినిధులు రాజధాని గ్రామ ప్రాంతాల్లో పర్యటించాలి
వారి వేదనను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్ళాలి
అమ్మ ఒడి పై రోజుకో ప్రకటన చేస్తున్నారు
అమ్మ ఒడి కి ఇతర పథకాల నిధులను మల్లించారు
రాష్ట్రంలో 67 శాతం ప్రభుత్వ పాఠశాలలు అధ్వానంగా ఉన్నాయి
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కి నిధులు ఖర్చు చేస్తే మంచిది
అమ్మ ఒడి పధకం పారదర్శకంగా లేదు
అమ్మ ఓడి పథకానికి అనేక షరతులు పెడుతున్నారు
షరతులు వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.