బీజేపీలోకి మోహన్‌బాబు..

*బీజేపీలోకి మోహన్‌బాబు...?*


*ఏపీలో ఏం జరుగుతోంది..?*


టాలీవుడ్ ప్రముఖుల్లో ఒకరైన మోహన్ బాబు... వైసీపీని వీడి... త్వరలోనే బీజేపీ కండువా కప్పుకోబోతున్నట్లు తెలుస్తోంది.. 


తాజాగా మోహన్ బాబు... కుటుంబ సమేతంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. దాదాపు అరగంటపాటూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా... నరేంద్ర మోదీ... మోహన్‌బాబు కుటుంబాన్ని బీజేపీలోకి ఆహ్వానించారు. దీనిపై వెంటనే సరే అని చెప్పకపోయినా... మోహన్‌బాబు నవ్వుతూ మోదీ ప్రతిపాదనను స్వాగతించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా... మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ... ఓ ట్వీట్ చేశారు. డైనమిక్ లీడర్‌ను కలిశానని ట్వీట్‌లో కామెంట్ పెట్టారు..


దీన్ని బట్టీ...మంచు ఫ్యామిలీ మొత్తం బీజేపీ గూటికి చేరబోతున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు హీట్‌గా మారాయి. కొత్తగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటడం, రాజధానిని అమరావతి నుంచీ వైజాగ్‌కి తరలించేందుకు సన్నాహాలు చేస్తుండటం వల్ల కృష్ణ, గుంటూరు జిల్లాల్లో రాజకీయాలు వేడెక్కాయి.. 


ఈ తరుణంలో... బీజేపీ రాజధానిని అమరావతిలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ... ధర్నాలు కూడా నిర్వహిస్తోంది. ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లాంటి వారు... రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఇలాంటి సమయంలో... తమ బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ...


మంచు వారి ఫ్యామిలీని ఆహ్వానించడం ద్వారా... అటు ఏపీ, ఇటు తెలంగాణలో రాజకీయాల్ని ప్రభావితం చెయ్యాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.అన్నీ సెట్ అయితే... అతి త్వరలో వైసీపీని వీడి... మోహన్ బాబు బీజేపీ కండువా కప్పుకునే అవకాశాలున్నాయి.
 
మోహన్ బాబు...జగన్మోహన్ రెడ్డికి చెందిన వైయస్ఆర్‌సీపీలో జాయిన్ అయ్యారు. జగన్ స్వయంగా ఆయన్ని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల నామినేషన్ ముగిసిన తర్వాత మోహన్ బాబు... వైసీపీలో జాయిన్ కావడం అప్పట్లో ప్రాధాన్యం సంతరించుకుంది. 


పార్టీలో మోహన్ బాబుకు...జగన్ ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారనే విషయంలో రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. ఐతే... మోహన్ బాబు ఎలాంటి పదవులు ఆశించకుండా వైసీపీలో బేషరుతుగా చేరానని తెలిపారు. ఇప్పుడాయన బీజేపీ వైపు చూస్తుండటంపై ఆసక్తికర చర్చ మొదలైంది.


Popular posts
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు
ఎస్కేప్ చానల్ నుండి రెండో పంటకు నీళ్ళు విడుదల చేసిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
Image
నెల్లూరు నగరములో చోరీ::వృద్దురాలిపై దాడిచేసి బంగారు నగలు అపహరణ.
Image