మూడు రాజధానులకు మద్దతుగా ర్యాలీలు

మూడు రాజధానులకు మద్దతుగా ర్యాలీలు
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం కార్యరూపం దాల్చాలంటూ నేడు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ అధ్వర్యంలో మానవహారాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. మూడు రాజధానులతో అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని.. రాష్ట్రం ప్రగతి సాధిస్తుందని పలువురు నాయకులు పేర్కొన్నారు. 
విశాఖపట్నం: అధికార, పరిపాలన వికేంద్రీకరణకు మద్దతు తెలుపుతూ రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించారు. అభివృద్ధిని ఒకే ప్రాంతానికి పరిమితం చేయొద్దని ప్రజలు కోరారు. అలాగే ప్రతిపక్ష టీడీపీ చేస్తున్న కుట్రలపై మండిపడ్డారు. విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా ప్రకటించాలని కోరుతూ గోపాలపట్నం పెట్రోల్ బంక్ నుంచి ఎన్ఏడి కొత్త రోడ్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, పశ్చిమ సమన్వయకర్త మల్ల విజయప్రసాద్, బెహరా భాస్కరరావు, శ్రీధర్ అప్పలనాయుడు  పలువురు వైఎస్సార్సీపీ నాయకులు, మహిళ కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
అనంతపురం: అధికార వికేంద్రీకరణకు మద్దతుగా అనంతపురం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి వేల సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చారు. ఆర్ట్స్ కళాశాల నుంచి కలెక్టరేట్ దాకా భారీ ప్రదర్శన నిర్వహించారు. బోస్టన్, జీఎన్ రావు కమిటీలను ఆమోదించాలని నినాదాలు చేశారు. ఆస్తులు కాపాడుకునేందుకు చంద్రబాబు ఉద్యమిస్తున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరికి మంత్రి శంకర్ నారాయణ సంఘీభావం తెలిపారు. ఈ ర్యాలీలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు అనంతవెంకట్రామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఇక్భాల్, వెన్నపూస గోపాల్ రెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, ఏపీ పాఠశాల విద్య కమిషన్ సీఈవో ఆలూరు సాంబశివారెడ్డి, డీసీసీబీ ఛైర్మన్ పామిడి వీరా, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి, వైఎస్సార్ సీపీ అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడు నదీం అహ్మద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహాలక్ష్మి శ్రీనివాస్ పాల్గొన్నారు. 
తూర్పుగోదావరి : ఒక రాజధాని వద్దు.. 3 రాజధానులు ముద్దు అంటూ రాజమండ్రి ఎంపీ భరత్ ఆధ్వర్యంలో కోటగుమ్మం జంక్షన్ నుంచి డీలక్స్ సెంటర్ వరకు వైఎస్సార్‌ సీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో మంత్రి రంగనాథరాజు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజమండ్రి కోఆర్డినేటర్ శివరామ సుబ్రహ్మణ్యం, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Popular posts
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image