దుర్గగుడిలో రాజధాని మహిళా రైతుల పూజలు
విజయవాడ: దుర్గగుడిలో రాజధాని మహిళా రైతులు పూజలు నిర్వహించారు. రాజధానిలో ప్రజల కంటే ఎక్కువగా పోలీసులను పెట్టారని మహిళా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అమరావతి వాసులం కాబట్టే పోలీసుల వలయాన్ని ఛేదించుకుని వచ్చామన్నారు. అమరావతిలోనే రాజధాని ఉండాలని అమ్మవారికి ముడుపులు చెల్లించుకున్నట్టు తెలిపారు. సీఎంకు దుర్గమ్మ మంచి బుద్ధి ప్రసాదించాలని వేడుకున్నామని మహిళా రైతులు తెలిపారు.
దుర్గగుడిలో రాజధాని మహిళా రైతుల పూజలు