*అరెస్టులతో ఆందోళనలను అణచివేయలేరు*
అమరావతి నుంచి రాజధానిని అప్రజాస్వామిక రీతిలో తరలిస్తుంటే రైతాంగం ప్రజాస్వామ్యయుతంగా ఆందోళనలు చేస్తోంది. వారికి బాసటగా నిలిచిన జనసేన నాయకులను పోలీసు యంత్రాంగం గృహ నిర్భందాలు చేసి, అరెస్టులు చేసి శ్రేణులను భయభ్రాంతులకు లోను చేయాలని చూస్తున్నారు. ఈ రోజు రైతులు చేపట్టిన జాతీయ రహదారుల దిగ్భందనానికి మద్దతు పలికిన జనసేనపై పోలీసులు చేపట్టిన చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు శ్రీ బోనబోయిన శ్రీనివాస యాదవ్ గృహ నిర్బంధంలో ఉంచారు. పార్టీ కార్యదర్శి శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్ ను తెల్లవారుజామునే పోలీసులు వెళ్లి కారణం చెప్పకుండా పోలీస్ స్టేషన్ కు తరలించారు. నాయకులను నిర్బంధించడం ద్వారా రైతులను, మా పార్టీ శ్రేణులను భయపెట్టాలని చూస్తున్నారా? అరెస్టులతో ఆందోళనలు అణచివేయలేరని ప్రభుత్వం గ్రహించాలి. ప్రశ్నించే పార్టీ మాది. ధర్మం వైపు నిలుస్తాం. ప్రజాస్వామ్యయుతంగా ఆందోళనలు చేస్తున్న రైతులను నిర్భంధించడాన్ని తప్పుబడుతున్నాం. మా నాయకులను, రైతులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
- పోతిన మహేష్,
అధికార ప్రతినిధి, జనసేన
అరెస్టులతో ఆందోళనలను అణచివేయలేరు:పోతిన మహేష్