గవర్నర్ చేతుల మీదుగా కమిషనర్ మూర్తి కి అవార్డు ప్రదానం
నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో ఓటరు నమోదు ప్రక్రియను అత్యంత సమర్ధవంతంగా నిర్వహించినట్లు గుర్తిస్తూ కమిషనర్ పివివిస్ మూర్తిని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిస్వభూషణ్ హరిచందన్ ప్రశంసించారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం అవార్డుల ప్రదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన విభాగం " బెస్ట్ ఎలక్టోరల్ రోల్ మేనేజ్మెంట్" అవార్డును కమిషనర్ మూర్తి అందుకున్నారు. జిల్లా నుంచి గవర్నర్ చేతులమీదుగా ప్రతిభా అవార్డులను అందుకున్నవారిలో కోటమండలం తహశీల్దార్ ఎమ్.మధుసూదనరావు, గూడూరు బి.ఎల్.ఓ కె. నిశాంతి ఉన్నారు.