తేది. 30-01-2020
పత్రికా ప్రకటన
రాజకీయ భిక్షపెట్టిన వారిని విమర్శించడం మీ నీచ వ్యక్తిత్వానికి నిదర్శనం
-డోలా బాల వీరాంజనేయ స్వామి
తిన్నింటి వాసాలు లెక్కపెట్టే కారం శివాజీ లాంటి వ్యక్తులు కూడా రాజకీయం గురించి, విలువల గురించి మాట్లాడటం సిగ్గు చేటు. పాముకు పాలుపోసి పెంచినా.. కాటు వేయాలనే ఆలోచనతోనే ఉంటుంది. మీకు రాజకీయ భిక్ష పెట్టి, కీలక పదవిలో కూర్చోబెట్టిన తెలుగు దేశం పార్టీపై విమర్శలు చేయడం హేయం. బడుగు బలహీన వర్గాలు రాజకీయంగా, ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని తపించేవారిలో చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ముందు వరుసలో ఉంటుంది. అందులో భాగంగానే ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ పదవిని మీకు ఇచ్చారు. కేబినెట్ హోదా కల్పించారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారిని కాదని ఎస్సీ, ఎస్టీ ద్రోహి అయిన జగన్మోహన్ రెడ్డి పంచన చేరిన నాడే నీ వ్యక్తిత్వం ఏంటో అర్ధమైంది? చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అందలం ఎక్కిస్తే ఆ హోదా నుంచి దించేందుకు జగన్మోహన్‌రెడ్డి అణుక్షణం ప్రయత్నించారు. అయినా మీరు ఆయన పంచ చేరి నీచ రాజకీయాలు చేస్తూ.. మీ విలువలేంటో ప్రజలకు తెలిసేలా చేశారు.
ఎవరు అధికారంలో ఉంటే వారి పంచన చేరే మీలాంటి వారు కూడా నీతులు గురించి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుతున్నారు. మీ వ్యక్తిగత హోదా కోసం తప్ప ఎన్నడూ ఎస్సీల అభ్యోన్నతి కోసం కృషి చేయలేదు. ఇప్పుడు కూడా కేవలం అధికారపక్షం నుంచి ఏదో రకంగా లబ్ది పొందాలనే తపన తప్ప ఎస్సీ అభివృద్ధికి కోసం కాదు. దళితుల అభివృద్దే కోరుకుంటే మునుపెన్నడూ చేయనన్ని పథకాలు అమలు చేసి వారి అభ్యున్నతికి పాటుపడిన తెలుగుదేశం పార్టీలోనే ఉండేవారు. అలా కాకుండా పార్టీ మారి మీరేంటో నీరూపించుకున్నారు.