రాజధాని కోసం ఉద్దండరాయునిపాలెంలో యాగం
అమరావతి: రాజధాని అమరావతిని తరలించొద్దని ఆకాంక్షిస్తూ ఉద్దండరాయునిపాలెంలో యాగం చేపట్టారు. రాజధాని శంకుస్థాపన ప్రాంతంలో శ్రీపాశుపత సంపుటీకరణ మహా కాలభైరవ యాగం నిర్వహించారు. రాజధానిగా అమరావతి కొనసాగాలని కోరుతూ శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి ఆధ్వర్యంలో యాగం కొనసాగింది. కార్యక్రమంలో రాజధాని మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పలువురు మహిళా రైతులు మాట్లాడుతూ.. ప్రభుత్వం తమ గోడు పట్టించుకోవడం లేదని, దైవ బలం కోసం యాగం చేస్తున్నట్లు తెలిపారు. విశాఖలో హుద్ హుద్ తుఫాను వస్తే అమరావతి రైతులు ధాన్యం పంపించి ఆదుకున్నారని, కర్నూలులో వరదలు వస్తే సరకులు పంపి మానవత్వం చాటుకున్నామని తెలిపారు. అమరావతి రైతులకు కష్టం వస్తే ఎవరూ స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజధాని కోసం ఉద్దండరాయునిపాలెంలో యాగం