ఏపీలో 3 ఓడరేవుల నిర్మాణం కోసం ప్రత్యేక కార్పొరేషన్లు
అమరావతి : ఏపీలో 3 ఓడరేవుల నిర్మాణం కోసం ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. రామాయపట్నం, భావనపాడు, మచిలీపట్నం లను పోర్టు డెవలప్‌మెంట్ కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తూ ఉత్వర్తులు జారీ చేశారు. ఏపీ మేరిటైమ్ బోర్డు ఆధ్వర్యంలో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలుగా పనిచేసేలా ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో సంస్థ పెట్టుబడి నిధి కింద 50 వేల షేర్ల జారీకి అనుమతి ఇచ్చారు. పోర్టు అభివృద్ధి సంస్థలో బోర్డు డైరెక్టర్లుగా సీఎస్, ఐదుగురు అధికారులు ఉండనున్నారు.
ఏపీలో 3 ఓడరేవుల నిర్మాణం కోసం ప్రత్యేక కార్పొరేషన్లు