30 సెకన్లలోనే అన్ని వివరాలు

30 సెకన్లలోనే అన్ని వివరాలు
విజయవాడ : విజయవాడ, గుంతకల్లు, నెల్లూరు డివిజన్‌ పరిధిలో కొత్త మొబైల్‌ యాప్స్‌ను రూపొందించినట్లు నెల్లూరు డీఎస్పీ వసంత్‌ కుమార్‌ గురువారం వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ 8.4 లక్షల నేరగాళ్ల డేటాను ఆన్‌లైన్‌లో పొందిపరిచినట్లు తెలిపారు. మొబైల్‌ గుర్తింపు పరికరంలో నేరగాళ్లు ఏ వేలిముద్ర వేసిన వాళ్ల వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు. ఇంతకముందు ఎడమచేతి బొటన వేలి ముద్రలను తీసుకునే వారని తెలిపారు.వేలిముద్ర వేయగానే 23 నుంచి 30 సెకన్లలో అన్ని వివరాలు నమోదవుతాయని వెల్లడించారు. దీని ద్వారా నేరాలు జరగకుండా నియంత్రించవచ్చని, నేరాగాళ్ల కదలికలను గుర్తించడంలో తేలికవుతుందన్నారు. అలాగే 15 పోలీస్‌ స్టేషన్లకు అధికారులు 30 మొబైల్‌ సెక్యూరిటీ చెక్‌ డివైస్‌లను అందజేసినట్లు డీఎస్పీ తెలిపారు. అదే విధంగా రైళ్లలో రోజుకు 60 నుంచి 70 బీట్లు ఉంటాయని, బీట్‌ళో ఉన్న సిబ్బంది ట్యాబ్‌, సెల్‌ ద్వారా మెసేజ్‌, వీడియోను ఈ యాప్‌ ద్వారా పంపవచ్చన్నారు. వేసవిలో ఉండే రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక  చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు