గుంటూరు ః
బిజేపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మి నారాయణ ని కలిసిన రాజధాని రైతులు.
*కన్నా లక్ష్మీనారాయణ కామెంట్స్...*
రాష్ట్ర విభజన తర్వాత రెండు కార్పోరేట్ కంపెనీల చేతుల్లో ఏపీ ప్రజలు నలిగిపోతున్నారు
ఎన్నికల్లో పెట్టుబడులు పెట్టి వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక అభివృద్ధి, సంక్షేమం విస్మరిస్తున్నాయి
ప్రభుత్వ విధానాలతో గత 50 రోజులుగా రాష్ట్రం రావణ కాష్టంలా మారింది
అవినీతి తప్ప ప్రభుత్వానికి వేరే ఆలోచన లేదు
విశాఖ రాజధాని గురించి ఉత్తరాంధ్రలో కూడా సానుకూలంగా లేరు
ఉత్తరాంధ్రలో కూడా అమరావతి రాజధాని కొనసాగించాలని కోరుతున్నారు
రాజధాని వస్తే తమకు సమస్యలు వస్తాయని ప్రజలు భయంతో ఉన్నారు
రాజధాని 29 గ్రామాల సమస్య కాదు రాష్ట్ర అభివృద్ధికీ సంబంధించినది
గత సీఎం ఇక్కడి రైతుల భూములు తీసుకుని రియల్ వ్యాపారం చేయాలని భావించారు
ఇప్పటి సీఎం ఇక్కడ దోచుకోవటానీకి ఏం లేదని విశాఖ వెళ్తున్నారు
వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ ఛార్జీలు, విద్యుత్ చార్జీలు పెట్రో ఛార్జీలు పెంచారు
ప్రజల రక్తం పీల్చేలా వైసీపీ పాలన సాగుతోంది
రాజధాని అమరావతిలో ఉండేలా మేం పోరాడుతాం
కన్నా లక్ష్మీనారాయణ గారిని కలిసిన వారిలో కొమ్మినేని సత్యనారాయణ, లంకా సుధాకర్, ఆవుల వెంకటేశ్వరరావు, మార్త నరేంద్రబాబు, గౌర్నేని స్వరాజ్య రావు, కొమ్మినేని శివయ్య, కారుమంచి నరేంద్ర, కంతేటి బ్రహ్మయ్య, పువ్వాడ సురేంద్రబాబు, కుప్పాల సుబ్బారావు తదితరులు ఉన్నారు......