ధన్యజీవి త్యాగశీలి మాత రామభాయి.
ఏపీ అర్పిఐ (అధవాలే) రాష్ట్ర అధ్యక్షుడు కోమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి
డాక్టర్ బాబాసాహెబ్ అంబెడ్కర్.సతీమణి అసమాన వనిత,త్యాగశీలి. ధన్యజీవి శ్రీమతి రామభాయి అంబెడ్కర్ 121 జన్మదినం పురస్కరించుకొని శుక్రవారం ఏపీ అర్పిఐ (అధవాలే) రాష్ట్ర అధ్యక్షుడు కోమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి ఆమె దేశానికి,నిమ్న కులాలకు చేసిన త్యాగానిరతిని కొనియాడారు.
దేశం కోసం ,సమాజం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబెడ్కర్ సతిమణిగా ఆమె తన జివితాన్ని,కన్నబిడ్డలను సైతం త్యాగం చేసిన అసమాన త్యాగశీలి అని కోమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి గుర్తుచేశారు.
నేటి సమాజంలో ప్రతి ఒక్కరు ఆ పుణ్యశ్రీ, మహానుభావులారు చేసిన కృషిని గుర్తు చేసుకోవాల్సి ఉందన్నారు.
బాబాసాహెబ్ కు దీటుగా వీరవణిత. రామభాయి చేసిన త్యాగాన్ని,తెగువను గుర్తు చేసుకోవాల్సి ఉందన్నారు.