శ్రీసిటీని సందర్శించిన ట్రైనీ ఐఏఎస్ ల బృందం
శ్రీసిటీ, ఫిబ్రవరి 28
పంజాబ్ క్యాడర్ కు చెందిన నలుగురు ఐఏఎస్ అధికారులు తమ స్టడీ టూర్ లో భాగంగా శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ సీనియర్ అధికారి ఎస్.పి.శర్మ వీరికి సాదర స్వాగతం పలికి, పారిశ్రామిక ప్రగతి, మౌలిక వసతులు, ప్రత్యేకతలను వారికి వివరించారు.
శ్రీ సిటీ పట్ల ఎంతో ఆకర్షితులైన ఐఏఎస్ అధికారులు, ఇక్కడ ప్రణాళిక, అమలు, స్థిరమైన పట్టణీకరణ సూత్రాలు, ఉద్యోగాల కల్పన తదితర అంశాలు చాలా అద్భుతంగా ఉందంటూ వ్యాఖ్యానించారు. శ్రీసిటీ పరిసరాలు చుట్టిచూడడంతో పాటు, రాక్ వర్త్ పరిశ్రమను వీరు సందర్శించి ఉత్పత్తులను, కార్మికుల పనితీరును పరిశీలించారు.