ఏపీలో‌ ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు

ఏపీలో‌ ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు
 అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఐపీఎస్‌ అధికారులకు పదోన్నతులు లభించాయి. 18 మంది ఐపీఎస్‌ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. సూపర్‌ టైం స్కేల్‌ ప్రకారం ఐపీఎస్‌లకు జీతాలు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పలువురు ఐపీఎస్‌ అధికారులకు డీఐజీగా పదోన్నతి కల్పించింది. 1995 బ్యాచ్ అధికారులు అతుల్ సింగ్, ఆర్కేమీనాలకు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2002 బ్యాచ్ ఐపీఎస్ అధికారులు సీహెచ్ శ్రీకాంత్, ఎ.ఎస్.ఖాన్, జె.ప్రభాకర్ రావు, డి.నాగేంద్రకుమార్ లకు ఐజీ ర్యాంకు హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2006 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారులు కె. రఘురామ్, అకె రవికృష్ణ, సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఆర్.జయలక్ష్మి, జీవీజీ అశోక్ కుమార్, జి.విజయకుమార్, ఎస్.హరికృష్ణ, ఎం.రవిప్రకాశ్, ఎస్.వి.రాజశేఖర బాబు, కెవీ.మోహన్రావు, పీహెచ్డీ రామకృష్ణలకు డీఐజీలుగా ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది.


Popular posts
నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద‌ ఖరీఫ్ విత్తనాల పంపిణీ 
Image
ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ నేడు 172 వ జయంతి.
Image
శాసన రాజధాని కుడా అమరావతిలో లేకుండా చేస్తాను అని వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలినాని అమరావతి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి అమరావతి 5 కోట్ల ఆంధ్రుల బావిషత్తు "కొడాలి నాని గారికి బుద్ధి రావాలని" ఉద్దండ్రాయునిపాలెంలో నాని గారి దిష్టిబొమ్మని పాడికట్టి శవ యాత్ర చేశారు..
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
ఏప్రిల్11-04-2020-మహాత్మా ఫూలే 193 వ జయంతి కార్యక్రమం సందర్భంగా,
Image