బెంజిస‌ర్కిల్ పైవంతెనపై ట్రయల్ రన్ విజయవంతం...

బెంజిస‌ర్కిల్ పైవంతెనపై ట్రయల్ రన్ విజయవంతం...
* రూ.80 కోట్లతో ఒక వరుస పనులు పూర్తి  
* 1470 మీటర్ల పొడవుతో నిర్మించిన ఫ్లై ఓవర్ అనుసంధానరగా 880 మీటర్ల అప్రోచ్ రోడ్డు
* ట్రయల్ రన్‌లో భాగంగా తొలిసారిగా ఫ్లైఓవర్‌పై పయనించిన ఏపి 36ఐహెచ్ 9786 నూతన వాహనం
* ఏలూరు వైపు నుంచి గుంటూరు వైపున‌కు జాతీయరహదారిపై వెళ్లే వాహనాలకు వెసులుబాటు 
* త్వరలోనే కేంద్రమంత్రి చేతులు మీదుగా జాతికి అంకితం
* జిల్లా కలెక్టర్‌ ఏ.యండి.ఇంతియాజ్ వెల్ల‌డి
విజ‌య‌వాడ‌,  (బెంజిసర్కిల్): పైవంతెన విజయవాడ నగర ట్రాఫిక్ సమస్య నియంత్రణకు ముఖ్యంగా బెంజిసర్కిల్ వద్ద ట్రాఫిక్ నియంత్రణకు ఎంతో ఉపకరిస్తుందని జిల్లా కలెక్టర్‌ ఏ.యండి. ఇంతియాజ్ తెలిపారు. సోమవారం సాయంత్రం ఏలూరు వైపు నుంచి వచ్చే వాహనాలను ట్రయల్ రన్‌లో భాగంగా అనుమతించడం జరిగిందన్నారు. సోమవారం సాయంత్రం నగర పోలీస్ కమిషనరు ద్వారకా తిరుమలరావు, జాతీయ రహదారుల ప్రాజెక్టు డైరెక్టర్‌ ఏ.విద్యాసాగర్‌లతో పాటు విలేఖరుల సమక్షంలో ఫ్లైఓవర్ ట్రయల్ రన్ కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ రూ.80 కోట్లతో రూపుదిద్దుకున్న ప్రతిష్టాత్మకమైన బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్ త్వరలోనే పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోనికి రానున్నదని, వచ్చే నెలలో కేంద్ర మంత్రివర్యులు చేతులు మీదుగా జాతికి అంకితం చేయడం జరుగుతుందన్నారు. దశాబ్దాల విజయవాడ ట్రాఫిక్ సమస్యకు ఒక పరిష్కారం చూపిస్తున్నామని తద్వారా ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించినట్లు అవుతుంద‌న్నారు. బెంజిసర్కిల్ పైవంతెన మొదటివరుస పనులను దిలీప్ బిల్ కాన్ సంస్థకు 2016 నవంబరులో జాతీయ రహదారులు సంస్థ ద్వారా పనులను అప్పగించడం జరిగిందన్నారు. బెంజిసర్కిల్ పైవంతెన పనులలో సాంకేతిక మైన కారణాలు, డి జైన్ల మార్పు వలన కొద్దిగా ఆలశ్యం అయినా ప్రజలకు పూర్తి స్థాయిలో త్వరలో అందుబాటులోనికి తెస్తున్నామన్నారు. మొత్తం 1470 మీటర్ల పైవంతెన, 880 మీటర్ల అప్రోచ్ రోడ్డుతో వంతెన నిర్మాణంతో 2.35 కిలోమీటర్ల నిర్మాణం పూర్తి చేయడం జరిగిందన్నారు. రెండవ వరుస ఫ్లెఓవర్ నిర్మాణానికి డిపిఆర్ పూర్తైంద‌ని ఆ పనులు కూడా ప్రారంభం అయితే రాబోయే ఏడాది నుంచి రెండేళ్ల సమయంలో రెండవ ఫ్లై ఓవర్ కూడా పూర్తి అవుతుందన్నారు. బెంజిసర్కిల్ పైవంతెన పై విద్యుత్తు దీపాలను త్వరితగతిన అందుబాటులోనికి తీసుకురావాలని ట్రాన్స్‌కో అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. గత 7, 8 నెలలుగా త‌న‌తో పాటు నగర పోలీస్ కమిషనర్  జాతీయ రహదారుల అధికారులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించి పనులు వేగవంత‌మ‌య్యేలా చూడ‌డంతో ట్రయల్ రన్ నిర్వహించుకోగలిగామన్నారు. 
                              నగర పోలీస్ కమిషనర్ సీహెచ్ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ నగరంలోంచి జాతీయ రహదారి మార్గం వెళుతున్నందున విజయవాడ నగరంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువుగా ఉందన్నారు. ట్రయల్ రన్ సందర్భంగా చిన్న చిన్న లోపాలను గుర్తించామని వాటి విషయమై సంబంధిత అధికారులకు సూచనలు చేసామన్నారు. పైవంతెన నుండి దిగే సమయంలో వాలు అధికంగా ఉన్నందున స్పీడు బ్రేకర్లను ఏర్పాటు చేయడం ద్వారా వాహనాల వేగాన్ని నియంత్రించవచ్చని అందుకు తగిన చర్యలు చేపట్టాలని జాతీయ రహదారుల నిర్మాణాల అధికారులకు సూచించామన్నారు. రిఫ్లక్టర్లతో కూడిన సూచిక బోర్డులను అందుబాటులోనికి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. పైవంతెనతో కొంతమేర నగర ట్రాఫిక్ సమస్యను అధిగమించగల‌మ‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. ట్రయల్ రన్ కార్య‌క్ర‌మంలో డిసిపిలు టి.నాగేంద్రకుమార్, వి.హర్షవర్ధనరాజు, ట్రాన్స్‌కో అధికారులు డిఇబివి సుధాకర్, ఏడిఇ ప్రవీణ్‌కుమార్, ఏఇ మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image