అవసరమైతే డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేస్తా

అవసరమైతే డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేస్తా
కడప: నగరానికి వచ్చిన డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు పౌరసత్వ బిల్లు సెగ తగిలింది. అంజాద్ బాషాను ముస్లింలు అడ్డగించారు. అసెంబ్లీలో సీఏఏ బిల్లును వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. వీరి డిమాండ్‌కు స్పందించిన అంజాద్ బాషా తనకు పదవులు ముఖ్యం కాదని, అవసరమైతే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. సీఏఏను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో ప్రతిపాదన పెట్టేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. ఎన్ఆర్సీ, సీఏఏ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఉపముఖ్యమంత్రి హామీతో ఆందోళనకారులు శాంతించి వెనక్కి తగ్గారు.