ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి నిర్ణయాలు

*12–02–2020*
*అమరావతి*


*అమరావతి: ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం*


*మంత్రిమండలి నిర్ణయాలు*


1.
పంచాయితీ రాజ్‌ చట్టంలో సవరణలకు ప్రభుత్వం ఆమోదం
పంచాయితీ ఎన్నికల్లో పోటీచేసే వ్యక్తులు గ్రామాల్లో ఉండేలా, గ్రామ అభివృద్ధి, పాలనా వ్యవహారాల్లో రోజువారీ పాల్గొనేలా కొన్ని సవరణలు 
ఎన్నికల్లో ప్రలోభపెట్టే చర్యలను నివారించేందుకు సవరణలు
పంచాయితీ, మున్సిపల్‌ ఎన్నికల్లో నియమావళికి విరుద్ధంగా అక్రమాలకు పాల్పడితే గతంలో ఉన్న 3–6 మాసాలు మాత్రమే శిక్షలు ఉండేవి
ఇప్పుడు పదవినుంచి తొలగించడమే కాకుండా, గరిష్టంగా 3 యేళ్ల జైలు శిక్ష, రూ.10వేలు జరిమానా
ఎన్నికల్లో నెగ్గిన తర్వాత కూడా ప్రలోభాగాలకు, నియమావళికి విరుద్ధంగా వ్యవహరించారని ధారాలు లభిస్తే పదవులనుంచి తొలగింపు, చట్ట ప్రకారం చర్యలు 
లెక్కింపు సమయం మినహా మొత్తం 13 నుంచి 15 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముగించేలా సవరణలు
పంచాయితీ ఎన్నికలల్లో ప్రచార గడువు 5 రోజులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రచారగడువు 7 రోజులుగా నిర్ణయిస్తూ కేబినెట్‌ ఆమోదం


గిరిజనులకు అనుకూలంగా మరో కీలక నిర్ణయం తీసుకున్న మంత్రిమండలి
నూటికి నూరుశాతం గిరిజన జనాభా ఉన్న తండాల్లో పంచాయితీ వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీటీసీ పదవులు పూర్తిగా వారికే కేటాయించాలని నిర్ణయం
పారిశుద్ధ్యం, పచ్చదనం పెంచే బాధ్యతలు కూడా సర్పంచులకే అప్పగిస్తూ నిర్ణయం
ఎన్నికైన సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు ఆయా గ్రామాల్లోనే స్ధానికంగా నివసించాలని కేబినెట్‌ నిర్ణయం
ప్రకృతి వైపరీత్యాలు, నీటి ఎద్దడి సమయంలో అత్యవసర చర్యలు తీసుకునే అధికారం సర్పంచులకే
పంచాయితీ ఎన్నికలకు సంబంధించిన ఈ నియమాలన్నీ కూడా మున్సిపాల్టీలలో పోటీ చేసే అభ్యర్ధులకూ వర్తింపజేస్తూ నిర్ణయం 


2.
మున్సిపల్‌ కార్పొరేషన్‌ చట్టలో సవరణలకు కేబినెట్‌ ఆమోదం. దీనిపై ఆర్డినెన్స్‌ తీసుకురావాలని నిర్ణయం.
కౌంటింగ్‌ మినహా గతంలో మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియ గతంలో 24 రోజులు కాగా దాన్ని 15 రోజులకు తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం



3.
ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌లిమిటెడ్‌ (ఏపీఎస్‌ఎఫ్‌ఎస్‌) ఏర్పాటుకు ఆమోదం
నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌గా ఏర్పాటు
మిగులు నిధులను సక్రమంగా వినియోగించుకునేందుకు ఏపీఎస్‌ఎఫ్‌ఎస్‌ ఏర్పాటు
గుజరాత్‌లో 1992లో ఇలాంటి కార్పొరేషన్‌ ఏర్పాటు 
మంచి ఫలితాలు ఇస్తోందని కేబినెట్‌కు వివరించిన అధికారులు



4.
ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ అగ్రికల్చర్‌ కౌన్సిల్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం
వ్యవసాయ, ఉద్యానవన రంగాల్లో ఉత్తమ పద్దతులకు తోడ్పాటునివ్వనున్న అగ్రికల్చర్‌ కౌన్సిల్‌
నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, ఇరిగేషన్‌ టెక్నాలజీ, వ్యవసాయ ఉత్తత్తుల మార్కెటింగ్, ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్, నాణ్యమైన విధానాల కోసం రెగ్యులేటింగ్‌ మెకానిజంగా పనిచేయనున్న కౌన్సిల్‌
అగ్రికల్చర్, హర్టికల్చర్‌ విద్యపై నియంత్రణ, పర్యవేక్షణ
ఉత్తమ విద్యను అందించడం, మౌలిక సదుపాయాలు కల్పించడం దీని లక్ష్యం
విద్యావ్యవస్ధను ఏ విధంగా మానిటరింగ్‌ చేస్తున్నారో, అదే విదంగా వ్యవసాయ విద్యనుకూడా మానిటర్‌ చేసేందుకు ఈ వ్యవస్ధ ఏర్పాటుకు నిర్ణయం
ప్రభుత్వరంగ సంస్ధలు, అనుబంధ సంస్ధలకు, పబ్లిక్, ప్రైవేట్‌ విభాగాల్లో పనితీరు మెరుగుపరిచేందుకు తోడ్పాటు అందించనున్న కౌన్సిల్‌
అగ్రికల్చర్, హర్టికల్చర్‌ విద్యాసంస్ధలను మానిటర్‌ చేయడంతో పాటు సరైన మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టనున్న కౌన్సిల్‌
నిబంధనలు, నియమాలు పాటించే కాలేజీలకు గుర్తింపునివ్వనున్న కౌన్సిల్‌
నకిలీ సర్టిఫికెట్స్‌ నిరోధంపై ప్రత్యేక దృష్టి
ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వనున్న కౌన్సిల్‌
జాతీయ, రాష్ట్ర స్దాయిలో ఇప్పటివరకూ లేని విధంగా కౌన్సిల్‌ ఏర్పాటు


5.
ఆంధ్రప్రదేశ్‌ గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం
10,000 మెగావాట్ల సామర్ద్యం గల ప్రాజెక్ట్‌ల ద్వారా రాష్ట్రంలో పగటిపూట 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ సరఫరా లక్ష్యం 
రైతులకు ఉచిత విద్యుత్, ఆక్వా రైతులకు సబ్సిడీపై విద్యుత్‌ ఇస్తున్న ప్రభుత్వం
దీనివల్ల ఏటా బడ్జెట్‌ మీద రూ.10,000 కోట్ల భారం పడుతోంది
ఈ నేపధ్యంలో నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను, ఆక్వారైతులకు ఇచ్చే సబ్సిడీ విద్యుత్‌ను నిరాటంకంగా కొనసాగించాలంటే ప్రత్యామ్నాయాన్ని అనుసరించాల్సిన అవసరం ఏర్పడింది
దీనికోసం 10,000 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ను నిరంతరాయంగా అందించేందుకు ఈ ప్రభుత్వం ప్రణాళిక సిద్దం చేసింది
ఆంధ్రప్రదేశ్‌లో సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తికి అనుకూల వాతావరణం ఉంది
ఏడాదిలో ఎండ కాచే రోజులు ఎక్కువ  
కేంద్ర ప్రభుత్వంలోని  సంప్రదాయేతర ఇంధన వనరుల మంత్రిత్వశాఖ ప్రతి మెగావాట్‌కు కూడా రూ. 20 లక్షల ఆర్దిక సహాయం అందిస్తుంది.
 ఈ వెసులుబాటును వినియోగించుకోవాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయం
ఏపి జెన్‌కోకు అనుబందంగా ఆంధ్రప్రదేశ్‌ గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఏర్పాటకు కేబినెట్‌ ఆమోదం
దీనిలో ఛైర్మన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సహా 18 పోస్టులు మంజూరుకు ఆమోదం 
 
6. భూసేకరణలో ఇప్పటివరకు పండ్లు, పూలతోటలకు ఇచ్చే నష్టపరిహారం పెంచుతూ నిర్ణయం తీసుకున్న కేబినెట్‌
మామిడి పరిహారం రూ.7283లకు పెంచుతూ నిర్ణయం,  గతంలో రూ.2600 మాత్రమే
కొబ్బరి చెట్టుకు రూ.6090 పరిహారం పెంపు, గతంలో ఈ మొత్తం కేవలం  రూ.2149 
నిమ్మపంటకు రూ.3210 పెంచుతూ నిర్ణయం, గతంలో ఈ పరిహారం కేవలం రూ.1444 మాత్రమే ఉండేది
మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల మేరకు పెరుగుతున్న ఖర్చులతో పాటు నష్టం వాటిల్లిన పరిస్ధితుల్లో పండ్లతోటలకు ఇచ్చే పరిహారాన్ని పెంచాలన్న నిర్ణయానికి ఆమోదముద్ర వేసిన కేబినెట్‌ 


7.
వైయస్సార్‌ కడప జిల్లా వేంపల్లెలో కొత్త ఫైర్‌ స్టేషన్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు