కేంద్రం వెనక్కు తగ్గే వరకూ పోరాటం...

కేంద్రం వెనక్కు తగ్గే వరకూ పోరాటం...
గూడూరు జేఏసీ ఆధ్వర్యంలో ప్రారంభమైన రిలే నిరాహార దీక్షలు...
ఎమ్మెల్యే, వైసీపీ, టీడీపీ, సీపీఐ, సీపీఎం, ప్రజా సంఘాల మద్దతు..
ఫోటో రైటప్ : 1. మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్ రావు...
2. దీక్షలో కూర్చున్న ముస్లిం సోదరులు
గూడూరు : ఎన్ఆర్సీ, సీఏఏ, ఎన్ పీఆర్ బిల్లులను కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకునేంత వరకూ పోరాటం ఆగదని గూడూరు జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. శనివారం స్థానిక పెద్ద మశీదు వద్ద జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ దీక్షలకు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ రావు, మాజీ ఛైర్ పర్సన్ పొణకా దేవసేనమ్మలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో ఎన్ఆర్సీ, సీఏఎలకు   వ్యతిరేకంగా అసెంబ్లీలో చర్చించేందుకు కృషి చేస్తామన్నారు. జేఏసీ నాయకులు జీలానీ బాష మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా నల్ల చట్టానికి వ్యతిరేకంగా కోట్లాది మంది ప్రజలు కుల, మతాలకు అతీతంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నా ఈ పాలకులకు కనీస జ్ఞానం లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. జేఏసీ అడ్వైజరీ కమిటీ నాయకులు ఎండి. అబ్దుల్ రహీం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేకంగా పార్లమెంటులో మంద బలంతో ఆమోదించుకున్న ఎన్ఆర్సీ, సీఏఏ‌, ఎన్ పీఆర్ లను వెనక్కు తీసుకునేంత వరకూ పోరాటం ఆపేది లేదన్నారు. సమాజంలో ని అన్ని వర్గాలను కలుపుకుని పోరాటం ఉధృతం చేస్తామని పిలుపునిచ్చారు.  సీనియర్ మైనారిటీ నాయకులు ఎండీ. అన్వర్ మాట్లాడుతూ   ప్రజా శ్రేయస్సును కోరే ప్రభుత్వమే అయితే వెంటనే నల్ల చట్టాలను రద్దు చేయాలన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లూరు యాదగిరి మాట్లాడుతూ ముస్లిమేతరులు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేకంగా ఆమోదించుకున్న నల్ల బిల్లులు కేవలం ముస్లిం లకే అనుకుంటే అంతకంటే పొరపాటు మరొకటి లేదన్నారు. దేశంలోని 130 కోట్ల మంది కూడా ఈ బిల్లుతో అవస్థలు పడాల్సి ఉందన్నారు.    ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి షేక్ అన్వర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎన్ఆర్సీ, సీఏఏలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఏపీఎండబ్ల్యూఓ జిల్లా అధ్యక్షులు మగ్దూమ్ మొహిద్దీన్ మాట్లాడుతూ ఢిల్లీలోని షహీన్ బాగ్ ను స్పూర్తిగా తీసుకుని యువత నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. తొలి రోజు దీక్షలలో షేక్ అన్వర్ బాను, మహమ్మద్ ఇస్లాం,  సయ్యద్ నయీమ్, షేక్ ఉమర్, సయ్యద్ అస్లం, చిల్లకూరు మండలం ఉడతావారి పాలెంకు చెందిన ఖాదర్ బాష, విందూరుకు చెందిన ఇంతియాజ్, దర్బార్ రఫీలు దీక్షలో కుర్చున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ పీఎస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మంద కృష్ణయ్య, ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్. దాసరి, సీపీఎం  నాయకులు పామంజి మణి, ఎన్. రాబర్ట్, ఎస్. ముత్యాలయ్య, వైసీపీ పట్టణాధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసులు, జిల్లా అధికార ప్రతినిధి నాశిన నాగులు, మాజీ కౌన్సలర్లు చోళవరం గిరిబాబు, రమేష్, శ్రీధర్, అల్తాఫ్,  అలీ ముర్తుజ, ఫయాజ్, కబీర్, రహెమాన్, దర్గా కమిటీ రియాజ్ భాయ్, షాను, దాయిన్, చిట్టేడు రఫీ, ఎస్ఎన్ఎం హైరర్స్ నజీమ్ భాయ్, జబ్బార్ మౌలానా, ఉస్మాన్, మశీదు కమిటీ సభ్యులు అజీజ్ ఖాన్,  తదితరులు పాల్గొన్నారు.