మైనింగ్ పై మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష

 


03.02.2020
అమరావతి


- మైనింగ్ పై మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష


- మైనింగ్ ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు


- అనధికారిక మైనింగ్ పై ఉక్కుపాదం


- పెండింగ్ లో వున్న దరఖాస్తులకు నిబంధనల మేరకు అనుమతులు


- పోలవరం కాలువ గట్లపై గ్రావెల్, మెటల్ విక్రయాలకు టెండర్లు


- 'ప్రైవేటు'కు చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో మైనింగ్ లీజులు వసూళ్ళు


రాష్ట్ర ప్రభుత్వంకు మైనింగ్ ఆదాయాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్థి, మైనింగ్ శాఖామంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. సచివాలయంలో మైనింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గనుల శాఖ ముఖ్య కార్యదర్శి రామ్ గోపాల్ తో పాటు పలువురు మైనింగ్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.  ఈ సందర్బంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మైనింగ్ లీజులు, సీనరేజీ ద్వారా ప్రభుత్వానికి వస్తున్న రెవెన్యూ పై సమీక్షించారు. మైనింగ్ కోసం పెండింగ్ లో వున్న దరఖాస్తులను పరిశీలించి, అవసరమైన అనుమతులు ఇవ్వాలని సూచించారు. అలాగే పోలవరం కుడి, ఎడమ కాలువల గట్లపై వున్న గ్రావెల్, మెటల్ నిల్వలను బ్లాక్ లుగా వర్గీకరించి టెండర్లు పిలవాలని ఆదేశించారు. ఇప్పటికే ఇరిగేషన్, మైనింగ్ అధికారుల సంయుక్త తనిఖీలో సుమారు ఆరు కోట్ల క్యూబిక్ మీటర్ల గ్రావెల్, మెటల్ నిల్వలను గుర్తించారని, వాటికి ప్రతి అయిదు కిలోమీటర్లకు ఒక ప్యాకేజీగా టెండర్లు పిలవాలని సూచించారు. ఎపిఎండిసి ద్వారా ఈ టెండర్ల ప్రక్రియను వారంరోజుల్లో ప్రారంభించాలని అన్నారు. మొత్తం మూడు వందల కిలోమీటర్ల పరిధిలో వున్న గ్రావెల్ ను విక్రయించడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చాలని అన్నారు. మేజర్, మైనర్ మినరల్స్ కు సంబంధించిన మైనింగ్ ను కూడా ఫస్ట్ కం ఫస్ట్ విధానంకు బదులుగా ఆక్షన్ విధానంను అమలు చేయడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని అన్నారు. దీనికి సంబంధించిన నిబంధనలను సమీక్షించాలని మైనింగ్ అధికారులకు సూచించారు. 
  *రెవెన్యూ బకాయిల వసూళ్లపై దృష్టి సారించాలి*
రాష్ట్రంలో మైనింగ్ శాఖ ద్వారా రావాల్సిన రెవెన్యూ బకాయిలు అవసరమైతే వన్ టైం సెటిల్ మెంట్ ద్వారా క్లియర్ చేయాలని అన్నారు. పెండింగ్ లో వున్న మైనింగ్ దరఖాస్తులను నిబంధనలకు అనుగుణంగా అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు. అలాగే ఓఎన్జిసి నుంచి మైనింగ్‌ శాఖకు రావాల్సిన 237 కోట్ల రూపాయలను కూడా వసూలు చేయాలని సూచించారు. రాష్ట్రంలో మైనింగ్ శాఖ ఇచ్చిన అనుమతులకు మించి అక్రమంగా మైనింగ్ చేస్తున్నారనే ఆరోపణలు వున్న క్వారీలపై వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే విజిలెన్స్ విచారణలో అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్న సంస్థల అనుమతులను శాశ్వతంగా రద్దు చేయడంతో పాటు అక్రమ మైనింగ్ పై పెనాల్టీలను కూడా విధించాలని అన్నారు. మహాచెక్ పేరుతో గతంలో జరిగిన తనిఖీల్లో అనధికారికంగా జరిగిన మైనింగ్ కు పెనాల్టీలను వసూలు చేయాలని సూచించారు. రాష్ట్రంలో కొత్త మైనింగ్ ప్రాంతాలను గుర్తించేందుకు నిర్ధేశించిన ''మెరిట్'' సంస్థ పనితీరు పట్ల మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అపారమైన ఖనిజ నిల్వలు వున్నాయని, వాటిని గుర్తించడం, మైనింగ్ కోసం ఔత్సాహిక సంస్థలకు సమాచారంను అందించడం వంటి కార్యక్రమాల్లో మెరిట్ మరింత చొరవ తీసుకోవాలని సూచించారు. చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రయోగాత్మకంగా మైనింగ్ లీజుల వసూళ్లను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలనే నిర్ణయంలో భాగంగా అమలుకు సంబంధించిన విధివిధానాలపై చర్చించారు. ప్రతి క్వారీ నుంచి లీజులు వసూలు చేసేందుకు రూపొందించిన ఆన్ లైన్ పోర్టల్స్ ను పరిశీలించారు.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image