కేంద్రం రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తోంది: నారాయణ
విశాఖ : కేంద్రం రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తోందని సీపీఐ నేత నారాయణ విమర్శించారు. గురువారం విశాఖ జిల్లా, నర్సీపట్నంలో అల్లూరి సీతారామరాజు భవన్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీజేపీని వ్యతిరేకించేవారిని కేంద్రం దేశద్రోహిగా పరిగణిస్తుందని విమర్శించారు. రాబోయే రోజుల్లో ఆర్మీని ఆసరాగా చేసుకుని ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యేందుకు ప్రధాని మోదీ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా మోదీకి పాకిస్తాన్‌పై యుద్ధం గుర్తుకొస్తుందని విమర్శించారు. ఢిల్లీ ఎన్నికల్లో గెలిచేందుకు మోదీ.. మంత్రులు, ఎంపీలను వీధినాయకుల్లా వాడుకుంటున్నారని నారాయణ ఆరోపించారు.
కేంద్రం రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తోంది: నారాయణ