గాంధీ విగ్రహం లోపల వద్దు పార్క్ బయటే ముద్దు
నాయుడుపేట, ఫిబ్రవరి 8 (అంతిమ తీర్పు) నాయుడుపేట నగరంలో మహాత్మా గాంధీ విగ్రహం 2018 సంవత్సరం ఆగస్టు 17 తేదీ ద్వవసంకు గురైన విషయం తెల్సిందే. నూతన విగ్రహం ఏర్పాటు చేయడంలో రాజకీయ సమీకరణాలు వేగంగా కలుషితమై మొక్కుబడిగా నూతన విగ్రహం ఏర్పాటు చేయడానికి ఒక అడుగు ముందుకు వేశారు. కానీ నూతనంగా నిరముంచబోవు మహాత్మా గాంధీ విగ్రహం పై ప్రజలు విమర్శలు చేస్తున్నారు. గతంలో గాంధీ అడుగు జాడల్లో నడిచిన ఆయనతో కలిసి పనిచేసిన కొందరూ అప్పట్లో మహాత్మాని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నూతన విగ్రహంను అప్పుడు ఉన్న విగ్రహం స్థలంలోనే ఏర్పాటు చేయాలని నేటి గాంధీలు డిమాండ్ చేస్తున్నారు.
పార్క్ లోపల విగ్రహం పెడితే గాంధి పేట ప్రజలకు కనిపించే అవకాశం కరువు అవుతుందని ప్రజలు వాపోతున్నారు. ఎదా విధంగా అదే స్థానంలో గాంధీ నూతన విగ్రహంను ప్రజాప్రతినిధులు, అధికారులు ఏర్పాటు చేసి ప్రజలు మన్నులు పొందాలని నేటి గాంధీ వాదులు కోరుతున్నారు.