బొత్సా... ఈ పందేనికి రెడీయా?: అచ్చెన్నాయుడు సవాల్

బొత్సా... ఈ పందేనికి రెడీయా?: అచ్చెన్నాయుడు సవాల్
చంద్రబాబు ముసలివారన్న బొత్స
తిరుమల కొండకు నడిచి వెళ్లేందుకు సిద్ధమా?
ఎవరు ముందు ఎక్కితే వారే కుర్రాళ్లన్న అచ్చెన్నాయుడు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముసలివారని మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన విమర్శలపై మాజీ మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. చంద్రబాబుతో పాటు బొత్స సత్యనారాయణ కాలినడకన తిరుమల కొండ ఎక్కాలని, ఎవరు ముందు ఎక్కితే వారు కుర్రోళ్లని, ఈ పందేనికి రెడీయా? అని సవాల్ విసిరారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో వరుస ట్వీట్లు చేశారు.
"ఎవరు యువకులు - ఎవరు ముసలివాళ్ళు : గౌరవ మంత్రివర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ గారు - ప్రతి పక్ష నాయకుడు అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముసలి వారు అయ్యారు అని వ్యంగ్యంగా ( ఒకరకంగా గేలిచేస్తూ)  అవాకులు చవాకులు పేలుతున్నారు. ఎవరు ముసలి వాళ్ళో-ఎవరు యువకులో తేల్చటానికి ఒక చిన్న పోటీ పెడదాము. బొత్స సత్యనారాయణ గారు ( ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ క్యాబినెట్ లోని ఏ మంత్రిగారైనా  సరే ) చంద్ర బాబు గారి కన్నా ముందు కాలినడకన తిరుమల కొండ ఎక్కండి?  ఎవరు ముందు ఎక్కితే వారు కుర్రోళ్ళు. మిగిలిన వారు ముసలోళ్ళు ! ఈ పోటీకి బొత్సగారూ సిద్ధమేనా ! పోటీకి సిద్ధంకాకపోతే ముసలివాణ్ణి అని పత్రికాసమావేశంలో ఒప్పుకోండి!" అని అన్నారు..
ఆపై "ఐటీ వారి పంచనామా చూశాక తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు బుగ్గనా? హైలీ రెస్పెక్టెడ్ విజయసాయిరెడ్డి,  మీరు రాయించింది, చెప్పింది అబద్ధమని మరోసారి తేలింది.క్విడ్ ప్రోకో, మీరు కొట్టేసిన 43 వేల కోట్ల నుంచి 2 వేల కోట్లు పంపితే వృద్ధులకు మీరు ఎత్తేసిన పింఛన్లను మేము చెల్లిస్తాం" అని కూడా మరో ట్వీట్ పెట్టారు.


Popular posts
కేసులు ఉపసంహరించుకోవాలి:తంగిరాల సౌమ్య
ఒరిస్సా వలస కూలీలకు నిత్యావసరాల పంపిణీ చేసిన సక్షమ్ 
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఉప రాష్ట్రపతి కి నిమ్మరాజు చలపతిరావు సన్మానం
మే 3 వరకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ : మోడీ