తాజా బడ్జెట్ చాలా నిరాశ పరిచిందని విశాఖ పట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం మొండిచేయి చూపించిందన్నారు. లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఢిల్లీ లో ఆయన మాట్లాడారు . బడ్జెట్‌లో కొన్ని సానుకూల, ప్రతికూల అంశాలున్నట్లు చెప్పారు. ప్రత్యేకహోదా కోసం ఎదురుచూసినప్పటికీ నిరాశే ఎదురైందన్నారు. విశాఖపట్నం, విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నా కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడతామని ఆయన స్పష్టం చేశారు.
తాజా బడ్జెట్ చాలా నిరాశ పరిచింది : విశాఖ పట్నం ఎంపీ