*జగనన్న విద్యా, వసతి దీవెనలకు అర్హుల జాబితా విడుదల* వింజమూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంఘిక సం క్షేమ శాఖ వారిచే ఇవ్వబడుతున్న జగనన్న విద్యా దీవెనకు సంబంధించి 920 మంది విధ్యార్ధులను అర్హులుగా ప్రకటించినట్లు యం.పి.డి.ఓ కనకదుర్గా భవాని పేర్కొన్నారు. విద్యా దీవెన అర్హత కలిగిన విధ్యార్ధులందరికీ ఫీజు రీయంబర్స్ మెంట్ పూర్తి స్థాయిలోనూ, జగనన్న వసతి దీవెన పధకం క్రింద భోజన, వసతి ఖర్చుల నిమిత్తం సంవత్సరానికి చెల్లింపులు జరుగుతాయన్నారు. ఇందుకు సంబంధించి అర్హులైన విధ్యార్ధుల జాబితాలను మండలంలోని అన్ని గ్రామ సచివాలయాలకు పంపడం జరిగిందన్నారు. ఈ నెల 24 వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి. చంద్రశేఖర్ రెడ్డి చేతుల మీదుగా అర్హులైన విధ్యార్ధులకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కార్డులను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కనుక విధ్యార్ధులు, వారి తల్లిదండ్రులు హాజరై ఈ కార్డులను అందుకోవాలని యం.పి.డి.ఓ కనకదుర్గా భవాని కోరారు.
జగనన్న విద్యా, వసతి దీవెనలకు అర్హుల జాబితా విడుదల*