కొండపల్లి ఉరుసు ఉత్సవాలకు ప్రభుత్వం తరపున సహాయం అందిస్తాం... కలెక్టర్ ఇంతియాజ్

కొండపల్లి ఉరుసు ఉత్సవాలకు ప్రభుత్వం తరపున సహాయం అందిస్తాం... కలెక్టర్ ఇంతియాజ్


  కృష్ణా జిల్లా కొండపల్లి గ్రామంలో హజరత్ సయ్యద్ షాహ్ బుఖారి మహాత్ముల వారి ఉరుసు ఉత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ హామీ ఇచ్చారు.ఆదివారం జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ ఇంతియాజ్ ను కొండపల్లి ఉరుసు ఉత్సవ కమిటీ సభ్యులు కలిశారు.ఉరుసు ఉత్సవాలకు కలెక్టర్ ఇంతియాజ్ ను సాదరపూర్వకంగా ఆహ్వానించారు. ఈసందర్భంగా కలెక్టర్ ఉరుసు ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్,క్యాలెండర్ ఆవిష్కరించారు.ఈసందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ మార్చి 4, 5, 6 తేదిల్లో కొండపల్లి లో 423 వ ఉరుసుమహోత్సవం జరుగనుండటం సంతోషకర విషయమన్నారు . ఉరుసు ఉరుసు ఉత్సవంలో ప్రభుత్వం తరపున తమ యంత్రాంగం కూడా పాలుపంచుకుంటుందని వెల్లడించారు. ఉత్సవాలకు పూర్తి సహాయ సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
తదనంతరం ఉరుసు ఉత్సవ కమిటీ చైర్మన్ మొహమ్మద్ అల్తాఫ్ రజా మాట్లాడుతూ ఈఏడాది ఉరుసు ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. లక్షలాది మంది ఈ ఉరుసు ఉత్సవాలకు తరలివచ్చే అవకాశం ఉందన్నారు.ఈఏడాది లక్ష మందికి అన్నదానం చేయనున్నట్లు చెప్పారు.అందరి సహకారంతో ఈ  ఉరుసు ఉత్సవం చేస్తున్నామని తెలియజేసారు.
ఈకార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముస్లిం సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ముక్తార్ అలీ,ముస్లిం నాయకులు GMC బాషా , .వైయస్ఆర్ సిపి నాయకులు రోహుల్లా న్యాయవాది ముక్తార్ ఆలి జీఎంసీ భాషా సయ్యద్ అలీం సయ్యద్ దిల్షాద్
తదితరులు పాల్గొన్నారు . ఉరుసు ఉత్సవ కమిటీ ఛైర్మెన్ మహమ్మద్ అల్తాఫ్ అలీ రజా కలెక్టర్ ని దుశ్శాలువతో సత్కరించారు.


Popular posts
నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద‌ ఖరీఫ్ విత్తనాల పంపిణీ 
Image
ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ నేడు 172 వ జయంతి.
Image
శాసన రాజధాని కుడా అమరావతిలో లేకుండా చేస్తాను అని వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలినాని అమరావతి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి అమరావతి 5 కోట్ల ఆంధ్రుల బావిషత్తు "కొడాలి నాని గారికి బుద్ధి రావాలని" ఉద్దండ్రాయునిపాలెంలో నాని గారి దిష్టిబొమ్మని పాడికట్టి శవ యాత్ర చేశారు..
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
ఏప్రిల్11-04-2020-మహాత్మా ఫూలే 193 వ జయంతి కార్యక్రమం సందర్భంగా,
Image